Supreme Court: ఢిల్లీ వాయుకాలుష్యంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో GRAP 4 చర్యల అమలును పర్యవేక్షించే కోర్టు కమిషనర్‌లకు సాయుధ రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీం కోర్టు ఆధేశించింది. కోర్టు కమిషనర్లుగా వ్యవహరిస్తున్న బార్ సభ్యులకు తగిన రక్షణ కల్పించడం ఢిల్లీ పోలీసుల బాధ్యత అని సుప్రీం కోర్టు పేర్కొంది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ జరిపింది.
Read Also: Health Tips: రాత్రిపూట ఈ 5 పదార్థాలు తినొద్దు.. కాలేయం, మూత్రపిండాలకు పెను ప్రమాదం
ఢిల్లీ ఎన్సీఆర్ లోకి ఎంట్రీ పాయింట్స్ వద్ద పరిశీలించేందుకు అడ్వకేట్స్ తో కమిషనర్లను సుప్రీం కోర్టు నియమించింది.
గ్రాఫ్ 4 ఉల్లంఘనలపై విచారణ జరుపుతున్న కమిషన్ కు బెదిరింపులు తప్పట్లేదని అడ్వకేట్స్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్స్ వద్ద టోల్ అధికారులకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని, అక్కడ కోర్టు కమిషనర్ల కదలికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్‌లను షేర్ చేసుకుంటున్నట్లు అడ్వకేట్స్ తెలిపారు. తదుపరి విచారణ గురువారానికి సుప్రీం కోర్టు వాయిధా వేసింది.