Fengal Cyclone: తమిళనాడులో తుఫాన్ విషాదం నింపింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు తిరువన్నమలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. నిన్నటి నుంచి కొండ చర్యలు కింద ధ్వంసమైన ఇళ్లల్లో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. 27 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ చేసినా అధికారుల శ్రమ ఫలించలేదు. కొండచరియలు విరిగిపడడంతో ధ్వంసమైన ఇంటిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందారు. ఐదుగురు పిల్లలు సహా ఇద్దరు పెద్దల మృతదేహాలను అధికారులు గుర్తించారు.
Read Also: Supreme Court: ఢిల్లీ వాయుకాలుష్యంపై సుప్రీం కోర్టులో విచారణ