అదానీ గ్రూప్ పై అమెరికా ఆరోపణలు: న్యాయవాది ముకుల్ రోహత్గీ వివరణ
అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ (డీఓజె) , యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) చేసిన ఆరోపణలపై, సీనియర్ న్యాయవాది ( భారత మాజీ అటార్నీ జనరల్) ముకుల్ రోహత్గీ స్పందించారు. నవంబర్ 27న విలేకరులతో మాట్లాడిన రోహత్గీ, అమెరికా అభియోగ పత్రాల్లో గౌతమ్ అదానీ / సాగర్ అదానీ పేర్లు చేర్చలేదని స్పష్టం చేశారు.
ఆరోపణల తీరుపై వివరాలు
డీఓజె & ఎస్ఈసీ, అదానీ గ్రూప్ సంస్థలు, అధికారులపై ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) ఉల్లంఘనతో పాటు, న్యాయానికి ఆటంకం కలిగించారనే ఆరోపణలు చేశాయి. అయితే రోహత్గీ, ఈ కేసుల్లో గౌతమ్ అదానీ / సాగర్ అదానీకి సంబంధం లేదని, అభియోగ పత్రాల్లో వారి పేర్లు ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
ముఖ్యాంశాలు:
- ఎఫ్సిపిఏ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలలో గౌతమ్ అదానీ /సాగర్ అదానీ పేర్లకు ప్రస్తావన లేదని తెలిపారు.
- ఇంతవరకు ఆరోపణలు న్యాయపరమైన ఆధారాలు లేకుండా ఉన్నాయని రోహత్గీ అభిప్రాయపడ్డారు.
- తాను అదానీ గ్రూప్ తరపున ప్రాతినిధ్యం వహించట్లేదని, తన వ్యాఖ్యలు స్వంత న్యాయపరమైన అభిప్రాయాలు మాత్రమేనని చెప్పారు.
అదానీ గ్రూప్ నవంబర్ 27న ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ గౌతమ్ అదానీ/సాగర్ అదానీ ఇతర అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ (AGEL) కూడా ఈ ఆరోపణలపై స్పందిస్తూ, అవి నిరాధారమైనవని స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్ CFO జగేష్ందర్ రబీ సింగ్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, నిజం వెలుగు చూస్తోంది అవాస్తవాలు,అనైతిక రిపోర్టింగ్‌పై మేము గట్టిగా నిలబడతాం అని తెలిపారు.
ఆరొపణలపై ఉన్న అనుమానాలు
- అభియోగ పత్రాల్లో పేర్ల గైర్హాజరు: చార్జిషీట్లో గౌతమ్ అదానీ ఇతర కీలక అధికారులను నేరారోపణలలో చేర్చకపోవడం అనేక అనుమానాలకు కారణమవుతోంది.
- సమర్థన కోసం సాక్షాలు: ఎస్ఈసీ & డీఓజె చేసిన ఆరోపణలపై మరింత స్పష్టత రావలసి ఉంది.
అమెరికాలో న్యాయపరమైన ప్రక్రియ
అదానీ గ్రూప్ ప్రస్తుతం అమెరికాలో న్యాయనిపుణుల సలహాలతో ముందుకుసాగుతోంది. కేసు వివరాలు ఇంకా విచారణలో ఉండడంతో, దీని ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై ఎలా పడుతుందనేది ఆసక్తికర అంశం.
అదానీ గ్రూప్ పై ఆరోపణలు వాటిపై వచ్చిన ఖండనలు వివాదం చుట్టూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, న్యాయపరమైన విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి స్థాయి నిజాలు బయటకు వస్తాయని ఊహించవచ్చు.