Actor Rajendraprasad: ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి(38) గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో శుక్రవారం(నిన్న) హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. నటుడు రాజేంద్రప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురి మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖలు రాజేంద్రప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు. గాయత్రిది ప్రేమ వివాహమని.. రాజేంద్రప్రసాద్ స్వయంగా ప్రస్తావించారు. ఓ సినిమా ఈవెంట్లో కూతురు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అమ్మలేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని ఎమోషనల్ అయ్యారు. తాను కూడా తన కూతురిలోనే తల్లిని చూసుకున్నానని.. కానీ తనకు కూతురితో మాటలు లేవన్నారు. తన కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని సినిమా ఈవెంట్లో తెలిపారు.
ఇదిలా ఉండగా.. గత నెలలోనే రాజేంద్రప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో మృతి చెందారు. విజయవాడలోని రామవరప్పాడు దగ్గర బైక్‌లో పెట్రోల్ పోయించుకుని వెళ్తున్న ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సోదరుడి మరణాన్ని మరవక ముందే రాజేంద్రప్రసాద్ ఇంట్లో మరో విషాదం నెలకొంది.
Allu Arjun America Andhra Pradesh AP News AP Politics BJP Bollywood BRS Cinema Cinema News CM Chandrababu CM Revanth Reddy Congress Cricket Crime News Donald Trump Entertainment Food Style Health News Health Tips Hyderabad India KTR Latest News Life Style Minister Gottipaati Ravi Kumar Movie News Naga Chaitanya Pakistan PM Modi Rashmika Mandanna Social Media Sports Tamil Cinema TDP Tech News technology Telangana Telugu Cinema Telugu News TG Politics Tollywood Wife YS Jagan YSRCP