Gold Prices: పసిడి ధరలు మళ్లీ వేగంగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం బంగారం ధర రూ. 80 వేలకు చేరువైంది. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు ఎగబాకడం గమనార్హం. బంగారం ధరల్లో పెరుగుదల చూస్తుంటే.. కొన్ని నెలల్లోనే తులం పుత్తడి లక్షను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం ఢిల్లీ మార్కెట్లో రూ.440 పెరిగి ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.79, 570కి చేరుకుంది. దేశీయంగా నాలుగో రోజు ధరలు ఎగబాకడానికి గల కారణాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. గత మూడు రోజుల్లో వరుసగా 450, 200, 800 పెరిగిన గోల్డ్ రేట్స్.. ఈ రోజు కూడా పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో స్వర్ణం మరింత ప్రియమవడం, పండగ సీజన్ కావడంతో ఆభరణ వర్తకులు, స్టాకిస్టులు కొనుగోళ్లు పెంచడం ధరలు పెరిగపోవడానికి కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. నిన్న కిలో వెండిపై రెండు వేలు పెరగగా.. నేడు రూ.500 పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేల ఒక వందగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో రూ.85,900గా నమోదైంది. దీపావళి పండగ ఉన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,800
విజయవాడ – రూ.72,800
ఢిల్లీ – రూ.72,930
చెన్నై – రూ.72,800
బెంగళూరు – రూ.72,800
ముంబై – రూ.72,800
కోల్‌కతా – రూ.72,800
కేరళ – రూ.72,800
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,420
విజయవాడ – రూ.79,420
ఢిల్లీ – రూ.79,570
చెన్నై – రూ.79,420
బెంగళూరు – రూ.79,420
ముంబై – రూ.79,420
కోల్‌కతా – రూ.79,420
కేరళ – రూ.79,420
మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ తొలిసారిగా 2,700 డాలర్ల స్థాయిని అధిగమించి, సరికొత్త జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఔన్స్(31.10 గ్రాములు) బంగారం ఒక దశలో 0.76 శాతం పెరిగి 2,728.10 డాలర్లకు వద్దకు చేరుకుంది. సిల్వర్ 32.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంలో అనిశ్చితి కారణంగా బులియన్ మార్కెట్‌లో ధరలు దూసుకెళ్తున్నాయని విశ్లేషకులు భావిస్తు్న్నారు. అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లు తగ్గిస్తుండటం కూడా పసిడి ధరలను ఎగదోస్తున్నాయని చెబుతున్నారు.