Home » Vijay Devarakonda: ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: ఈ మధ్య చూసిన బెస్ట్ ట్రైలర్

Vijay Devarakonda: దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా వస్తోన్న సినిమా “లక్కీ భాస్కర్”. టాలెంటెడ్ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్ఙంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అభిమానులను కలిసి చాలారోజులు అవుతుంది. మీరందరూ సంతోషంగా, బాగున్నారని కోరుకుంటున్నాను. నా సోదరుడు దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది. పెళ్లిచూపులు హిట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్ కి పిలిపించి, కూర్చోబెట్టి నాతో మాట్లాడి, నాకు నా ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఏడేళ్లవుతుంది అనుకుంటా. చాలారోజులు పట్టింది సినిమా చేయడం. రాసిపెట్టుందేమో ‘VD12’ నేను, గౌతమ్ సితారలో చేయాలని. త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం నా లైఫ్ లో ఒక బిగ్ మూమెంట్. మన జనరేషన్ కి తెలుసు మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జల్సా, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన మనల్ని ఆఫీస్ కూర్చోబెట్టి నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆయన నా అభిమానుల్లో దర్శకుల్లో ఒకరు. ఆ తర్వాత ఆయనను చాలాసార్లు కలిశారు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి త్రివిక్రమ్ గారు చెబుతూ ఉంటే అలా వింటూ కూర్చోవచ్చు. ఇక లక్కీ భాస్కర్ విషయానికొస్తే, ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్స్ లో ఒకటి. లక్కీ భాస్కర్ తో వెంకీ ఒక కొత్త లెవెల్ అన్ లాక్ చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. మీనాక్షి చౌదరికి కూడా ఇందులో మంచి పాత్ర లభించిందని అర్థమవుతోంది. నేను నటుడు కాకముందు నుండే దుల్కర్ సినిమాలు చేస్తుండేవాడిని. మేము మహానటి, కల్కి సినిమాలు కలిసి చేశాను. నా సోదరుడు దుల్కర్ సినిమా వేడుకకు రావడం సంతోషంగా ఉంది. దుల్కర్ కి, సితారకి, వెంకీకి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *