Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దన్నారు. బీఆర్ఎస్ వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తామన్నారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పాను..పార్టీలు మారిన వాళ్ళు వ్యభిచారులు అయితే నీ అయ్యది ముందు ఏ పార్టో కేటీఆర్ చెప్పాలి. పార్టీ మారిన వాళ్ళు వ్యబిచారులు అయితే.. నీ అయ్యను ఏ పేరుతో పిలవాలో కేటీఆర్ చెప్పాలి. దీపావళి వరకు అరెస్టు చేస్తామని కాంగ్రెస్ అంటుంది, అరెస్టు చేస్తే మీ అంతు చూస్తామని బీ ఆర్ ఎస్ అంటుంది. రెండు పార్టీలు ఒక్కటే, దోందు దొందే. నువు కొట్టినట్టు చేయు, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేస్తున్నాయి.