Home » Two Women Assaulted Case: అత్తాకోడలిపై అత్యాచారం.. వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి స్పందన

Two Women Assaulted Case: అత్తాకోడలిపై అత్యాచారం.. వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి స్పందన

Rape of mother-in-law: వైసీపీ నాయకురాలి స్పందన

Two Women Assaulted Case: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటనను వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణీ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దుర్మార్గమైన ఘటన జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి, కనీసం స్ధానిక ఎమ్మెల్యే కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా కల్పించలేకపోవడం శోచనీయమన్నారు.

Rape of mother-in-law: వైసీపీ నాయకురాలి స్పందన
Rape of mother-in-law: వైసీపీ నాయకురాలి స్పందన

మచ్చుమర్రి ఘటనతో సహా రాష్ట్రంలొ రోజుకొక దారుణం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్న వరుదు కళ్యాణి.. మహిళల రక్షణకు కనీస చర్యలు తీసుకోవడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలోవైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు రూపొందించిన దిశ యాప్, దిశ చట్టాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితులు లేకపోగా…. హిందూపురం ఘటనతో ఇంట్లో ఉన్నా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం ఘటనలో అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *