Home » TG DSC 2024: Certificate Submission and Verification Details

TG DSC 2024: Certificate Submission and Verification Details

TG DSC 2024: Certificate Submission and Verification Details

TG DSC : DSC విద్యార్థులకు బిగ్ అలెర్ట్, అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

 TG DSC : తెలంగాణ DSC ఫలితాలు విడుదలయ్యాయి. DSC ఉత్తీర్ణులైన విద్యార్థులకు అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే  5  వరకు ప్రతిరోజూ ఉదయం 10  గంటల  నుంచి సాయంత్రం 5 గంటల  వరకు  సర్టిఫికెట్ వెరిఫికేషన్  జరుగుతుంది  … సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:3 నిష్పత్తిలో జరుగుతుందని, అర్హత ఆధారంగా అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

తుది జాబితాను జిల్లా DEO లు ప్రకటిస్తారు.దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల కాపీలతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని సూచించారు.

DSC ఫలితాలు విడుదల

సచివాలయంలో తెలంగాణ DSC 2024  ఫలితాలను రేవంత్ రెడ్డి విడుదల చేశారు.  ఈ  ఏడాది జూలై 18  నుంచి  ఆగస్టు 3 వరకు  DSC పరీక్షలు  నిర్వహించగా… ఫలితాల వెల్లడిలో జాప్యంపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొనడంతో ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ మెగా DSC-2024 లో మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు.వీటిలో  2,629  స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727  లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 6508 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు  , 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు  , 220 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్  పోస్టులు, 796 సెకండరీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు  ఉన్నాయి. తెలంగాణలో 2024లోనే DSC నియామకాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 55 కేంద్రాల్లో DSC పరీక్షలు నిర్వహించారు.

TG DSC 2024: Certificate Submission and Verification Details
TG DSC 2024 certificate verification process begins on October 1, students must prepare original certificates for submission.

తెలంగాణ DSC పరీక్షకు 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.మొత్తం 2,45,263 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 34,694 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు.సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను  ఈ నోటిఫికేషన్లో భాగంగా భర్తీ చేయనున్నారు. లాంగ్వేజ్ స్కాలర్స్ 727,  ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 182, ఎస్జీటీలు 6,508, స్పెషల్ ఎడ్యుకేషన్  220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

మరోవైపు DSC జనరల్ ర్యాంకు జాబితాలను విడుదల చేస్తే నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఖాళీల ఆధారంగా 33 జిల్లాల్లో ధ్రువపత్రాలను ప్రాసెస్ చేయాల్సి ఉంది.సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా సెలక్షన్ కమిటీలకు పంపుతారు.ఈ మొత్తం ప్రక్రియకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *