“సాంకేతిక నైపుణ్యం అందించడానికి హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారాలి. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా నిలబెట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
🔹గత పదేళ్లలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. ఆ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించినందునే యవత ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
🔹 బ్యాంకింగ్, ఫైన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ యువతకు మార్గనిర్దేశనం చేశారు.
🔹జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ (JNAFU) క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పలువురు ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
🔹 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువకులు గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలవుతున్నారు. కొందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సైతం డ్రగ్స్ సరఫరా చేస్తుండటం బాధాకరం. ఇది తెలంగాణకు ప్రమాదం. కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉంది.
🔹 వ్యసనాలకు బానిస కాకుండా ఉండేందుకే వారిలో విశ్వాసం పెంపొందించడానికి ఐటీఐలను టాటా టెక్నాలజీస్‌తో కలిసి ఏటీసీలుగా తీర్చిదిద్దడం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నాం.
🔹 ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నలక్షలాది విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండకపోవడానికి ప్రధానంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్‌లో సరైన నిపుణులు లేకపోవడమే. యాజమాన్యాలు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగిస్తే ఆ కాలేజీల అనుమతులను రద్దు చేయడం ఖాయం.
🔹 ఐఎస్బీ, ఐఐటీ, నల్సార్, త్రిబుల్ ఐటీ, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి నాణ్యమైన విద్యా సంస్థలు ఉన్నందునే బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ వస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ ఒక హబ్‌గా మారాలి.
🔹 ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఎదిగిన అజయ్ బంగా, సత్యనాదెళ్ల, శంతను నారాయణ లాంటి పెద్ద కంపెనీలకు సీఈవోలు హైదరాబాద్‌లో చదువుకున్న వారేనని గుర్తుచేస్తూ అలాంటి ప్రముఖులను వచ్చే డిసెంబర్‌లో నగరానికి ఆహ్వానిస్తాం.
🔹 ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా లాంటి చిన్న దేశం 32 పతకాలను సాధిస్తే, 140 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి ఒక్క బంగారు పతకం కూడా సాధించలేకపోయింది. ఈ పరిణామం మనందరికి కనువిప్పు లాంటిది. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
🔹 ఒలింపిక్స్, నేషనల్ గేమ్స్ పాల్గొనదలిచే వారికి శిక్షణ పొందడానికి అన్ని వసతులతో వచ్చే సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ కూడా ప్రారంభిస్తాం.
🔹 ఈ ప్రభుత్వం యువతను దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాల్సిన అంశాలు ప్రధానంగా యువతకు ఒక దిశను చూపెట్టాల్సిన అవసరం ఉంది.
🔹 తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం అలుపెరుగని రీతిలో పనిచేస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఒక రోల్ మాడల్ గా తీర్చిదిద్దుతాం.