Home » తెలంగాణ సెట్ 2024 ప్రిలిమ్స్ కీ విడుదల: అభ్యంతరాల గడువు

తెలంగాణ సెట్ 2024 ప్రిలిమ్స్ కీ విడుదల: అభ్యంతరాల గడువు

Telangana SET 2024 Preliminary Key Released for Objections

Telangana SET Exam Preliminary Key Released In Hyderabad: తెలంగాణ సెట్ పరీక్ష ప్రిలిమినరీ Key విడుదలైంది. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 26తో గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.

Telangana SET 2024 Prelims Key Released: ఈ నెల 24వ తేదీ నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 26తో ముగియనుంది. సంబంధిత సబ్జెక్టుల్లో అభ్యంతరాలను http://telanganaset.org/ వెబ్సైట్ ద్వారా పంపాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత Key ని ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. త్వరలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో పరీక్ష నిర్వహించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సెట్-2024 పరీక్ష నిర్వహించింది.
అభ్యంతరాలు లేవనెత్తే ప్రక్రియ…
1. అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/ వెబ్సైట్ను సందర్శించాలి.
2. హోమ్ పేజీలో కనిపించే ఆన్సర్ కీ అభ్యంతర (ఆన్లైన్) లింక్ కోసం లాగిన్పై క్లిక్ చేయండి.
3. మీ హాల్ టికెట్ నంబర్ , మీ పుట్టిన తేదీ వివరాలను ఇక్కడ నమోదు చేయండి.
4. అప్పుడు ఒరిజినల్ key పై అభ్యంతరాలు వ్యక్తం చేయాలి.
తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో నిర్వహించారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి . పేపర్ -2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మూడు గంటల పాటు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్-పేపర్-1 , పేపర్-2 అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాయాలి. సైన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు.

Telangana SET 2024 Preliminary Key Released for Objections
Telangana SET 2024 Preliminary Key Released for Objections

50 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఒక పేపర్-1 ప్రశ్నపత్రం ఉంటుంది . ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్ను పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. లాజికల్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, డిఫరెంట్ థింకింగ్ అప్రోచ్ లను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్ 2 ప్రశ్నపత్రం అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఒక్కో సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు .

Read Also

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *