Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే
Deepika Padukone: బాలీవుడ్ బెస్ట్ కపుల్స్లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ జంట ఒకటి. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దీపిక పదుకొనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ శుభవార్తతో దీపికా, రణవీర్ కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ జంటకు అభిమానులు, నెటిజనులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరిలో దీపిక గర్భం దాల్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా…