Home » CM Chandrababu
Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయం మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా వివాదాస్పదమైనట్లు మంత్రి వెల్లడించారు. కేవలం పీపీఏల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లు పేర్కొన్నారు. నాడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా లేఖ రాసిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. ప్రతీ ఏడాది వినియోగదారుల సంఖ్య 5 నుంచి 6 శాతం పెరుగుతున్నా కానీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క మెగా వాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేసిన పాపన పోలేదని విమర్శించారు. విద్యుత్‌ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏపీ తీసుకొచ్చిన పాలసీ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు క్రమంగా వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (రెండో సవరణ), 2024 బిల్లు తీసుకువస్తున్నాట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం గానీ, విద్యుత్ సుంకం కానీ విధించడం లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం 2021 లోనే తీసుకుని వచ్చినా... సుంకం విధించే విషయంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి విద్యుత్ అంతరాయాలు ఏపీలో ఎక్కువగా ఉండేవని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగానికి జరిమానాలు వేసిన విష సంస్కృతి నాడు ఉండేదని దుయ్యబట్టారు. తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈఆర్సీకి కేవలం రూ. 3 వేల కోట్ల మాత్రమే అప్పు ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2022-23 ఏడాదికి రూ. 6 వేల కోట్లు అప్పు ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. దీనితో పాటు 2023-24 ఏడాదికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. మొత్తంగా రూ. 17 వేల కోట్లు ప్రజలపై భారం వేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో విద్యుత్ రంగం సర్వనాశనం అయ్యిందని నమ్మిన ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేసినట్లు విమర్శించారు.

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రస్తక్తే లేదు

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయం మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా…

Read More

Nominated Posts: నామినేటేడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

Nominated Posts: ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. సర్కారు విడుదల చేసిన లిస్ట్ ఇదే..

Read More
AP Cabinet approves drone policy: ముఖ్య నిర్ణయాలు

AP Cabinet: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..

AP Cabinet Approves Drone Policy and Takes Key Decisions : డ్రోన్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో…

Read More
Minister Gottipati: చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమ భేష్

Minister Gottipaati: చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు భేష్

Minister Gottipaati Ravi kumar: మూడు పార్టీల నేతలు కష్టపడి పని చేయడం కారణంగానే కూటమి ప్రభుత్వం అత్యధిక మధ్య మెజారిటీతో గెలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. భీమవరంలో నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా కూటమి సభ్యుల ఆత్మీయ సదస్సులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు. ఇంచార్జ్ మంత్రి హోదాలో గొట్టిపాటి రవి కుమార్ తొలిసారి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై దృష్టి…

Read More
Diwali gift: సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం

Free Cylinder Scheme: దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం

Free Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుకగా సూపర్‌ సిక్స్‌లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకం అమలులోకి వచ్చింది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. నిన్నటి నుంచి దీపం -2 పథకం అమల్లోకి వచ్చింది. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్…

Read More
AP Cabinet భేటీ నవంబర్ 6, బడ్జెట్ అసెంబ్లీకి 12న

AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్!

AP Cabinet: నవంబర్‌ 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. నవంబర్‌ 6 ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో…

Read More

Perni Nani: ఇదేమన్నా రాష్ట్ర సమస్యా.. జగన్ బెయిల్ రద్దు చేయటం కోసం చేస్తున్న కుట్ర

Perni Nani: జగన్‌ కుటుంబ విషయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోదని.. కానీ తల్లి, చెల్లిపై జగన్ కేసు వేసాడనీ ఇది భూమి బద్దలయ్యే విషయంగా టీడీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌పై విషం చిమ్మేలా ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మరణానికి ముందే జగన్, షర్మిలకు ఆస్తులు కేటాయింపు జరిగిందన్నారు. తర్వాత జగన్ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుతో అనేక…

Read More

CM Chandrababu: సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

CM Chandrababu: జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి రామానాయుడుతో పాటు జిల్లాల నుంచి వచ్చిన ఇరిగేషన్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి…సాధ్యమైనంత త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేపట్టారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్…

Read More

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం…

Read More
YS Jagan: ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తోంది.. జగన్ ట్వీట్

YS Jagan: ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తోంది.. జగన్ ట్వీట్

YS Jagan: పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట.. ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు సర్కారు తీరు అలాగే ఉందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. అందుకే ఆయననే అడుగుతున్నా రాష్ట్రంలో…

Read More

Tirupati Laddu: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు?.. ఎన్డీడీబీ రిపోర్టులో సంచలన విషయాలు

Tirupati Laddu: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూ తయారీలో నాసిరకం పదార్థాలు, జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై వివాదం తలెత్తింది. లడ్డూలలో జంతువుల కొవ్వు కల్తీ అయినట్లు గుజరాత్‌కు చెందిన లైవ్‌స్టాక్ ల్యాబ్ ధృవీకరించినట్లు అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గురువారం పేర్కొంది. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రామన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో అందించిన నెయ్యి శాంపిల్‌లో బీఫ్ ఫ్యాట్ ఉన్నట్లు నిర్థారించిన ల్యాబ్ రిపోర్టును మీడియా ముందు చూపించారు. ఇదిలా ఉండగా.. లడ్డూ…

Read More