Home » AP Politics
Posani Krishna Murali Announces to Quit Politics

Posani Krishna Murali: రాజకీయాలకు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుడ్‌బై

Posani Krishna Murali: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి రాజకీయాలను మాట్లాడనని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించనన్నారు. నన్ను ఎవరు ఏమనలేదు.. ఎవరి గురించి ఇక నుంచి మాట్లాడనన్నారు.పదహారేళ్ల క్రితం నుంచి తాను తన కుటుంబాన్ని పట్టించుకోలేదన్నారు. రెండ్రోజుల క్రితం నా చిన్న కొడుకు అడిగాడు.. డాడీ నన్నెందుకు పట్టించుకోలేదంటూ అడిగాడన్నారు. రాజకీయాలు…

Read More

Minister Gottipaati Ravi Kumar: గ‌త ఐదేళ్ల‌లో 9 సార్లు విద్యుత్ చార్జీల‌ను పెంచిన ఘ‌న‌త వైసీపీ ప్రభుత్వానిదే..

Minister Gottipaati Ravi Kumar: 2019 వ‌ర‌కు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌ని, అనంత‌రం అధికారం చేప‌ట్టిన వైసీపీ ప్రభుత్వం విధ్వంస‌క‌ర నిర్ణ‌యాల‌తో విద్యుత్ రంగాన్ని వేల కోట్ల రూపాయిల న‌ష్టాల్లోకి నెట్టేసింద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. శాస‌న మండ‌లిలో బుధ‌వారం స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెబుతూ… రాష్ట్రంలో ప్ర‌స్తుతం విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వం.. ట్రూ అప్ చార్జీల‌ను వేసి ఈఆర్సీకి పంపి… రెండు సంవ‌త్స‌రాలు…

Read More
Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయం మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా వివాదాస్పదమైనట్లు మంత్రి వెల్లడించారు. కేవలం పీపీఏల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లు పేర్కొన్నారు. నాడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా లేఖ రాసిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. ప్రతీ ఏడాది వినియోగదారుల సంఖ్య 5 నుంచి 6 శాతం పెరుగుతున్నా కానీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క మెగా వాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేసిన పాపన పోలేదని విమర్శించారు. విద్యుత్‌ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏపీ తీసుకొచ్చిన పాలసీ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు క్రమంగా వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (రెండో సవరణ), 2024 బిల్లు తీసుకువస్తున్నాట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనపు భారం గానీ, విద్యుత్ సుంకం కానీ విధించడం లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం 2021 లోనే తీసుకుని వచ్చినా... సుంకం విధించే విషయంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి విద్యుత్ అంతరాయాలు ఏపీలో ఎక్కువగా ఉండేవని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విద్యుత్ వినియోగానికి జరిమానాలు వేసిన విష సంస్కృతి నాడు ఉండేదని దుయ్యబట్టారు. తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా పాలించిన ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈఆర్సీకి కేవలం రూ. 3 వేల కోట్ల మాత్రమే అప్పు ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత 2022-23 ఏడాదికి రూ. 6 వేల కోట్లు అప్పు ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. దీనితో పాటు 2023-24 ఏడాదికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. మొత్తంగా రూ. 17 వేల కోట్లు ప్రజలపై భారం వేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో విద్యుత్ రంగం సర్వనాశనం అయ్యిందని నమ్మిన ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేసినట్లు విమర్శించారు.

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రస్తక్తే లేదు

Minister Gottipaati Ravi Kumar: వ్యవసాయం మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా…

Read More
YS Vijayamma బహిరంగ లేఖ: తీవ్ర మానసిక వేదన

YS Vijayamma: తీవ్ర మానసిక వేదన కలుగుతోంది.. వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ

YS Vijayamma: వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖ రాశారు. కొన్నాళ్ల క్రితం కర్నూలులో జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తన లేఖలో ఖండించారు. లేఖలో విజయమ్మ ఏమన్నారంటే.. “గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక వేదన కలుగుతోంది. నన్ను అడ్డం పెట్టుకుని…

Read More
Minister Ravi Kumar: కోడెలకు టీడీపీలో స్థానమే

Minister Gottipaati Ravi Kumar: కోడెలకు టీడీపీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది..

Minister Gottipaati Ravi Kumar: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కోడెల చేసిన సేవలు వెల కట్టలేనివని పేర్కొన్నారు. కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో కోడెల అంటే తెలియని వారు ఎవరూ లేరని అలాంటి మహా నాయకుడి విగ్రహాన్ని దొంగచాటుగా అర్థరాత్రులు పెట్టాల్సిన…

Read More

Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీని కోరింది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాదా?

Minister Gottipaati Ravi Kumar: తన 5 ఏళ్ల పాలనలో 9సార్లు కరెంటు చార్జీల పెంచి పేదలపై మోయలేని భారం మోపిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని అప్పగిస్తే వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది మీరు కాదా జగన్? అని ప్రశ్నించారు. నీ అసమర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా?…

Read More
గొట్టిపాటి రవి కుమార్: జగన్ రెడ్డి చేసిన పాపాల ప్రభావం

Minister Gottipaati Ravi Kumar: జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు

Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏ లను జగన్ రెడ్డి అధికారంలోకి…

Read More

Minister Gottipaati Ravi Kumar: వెల్లువెత్తిన ప్రజావినతులు..తానేటి వనిత తన అక్క అంటూ 10 లక్షలు దోపిడీ

Minister Gottipaati Ravi Kumar: తానేటి వనిత తనకు అక్క అవుతుందని చెప్పి సబ్ రిజిస్ట్రర్ యూనియన్ ప్రెసిడెంట్ తనకు బావ అవుతాడని చెప్పి కొవ్వూరు సబ్ రిజిస్ట్రర్ ఆఫీసునందు లేఖరుగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ తమ కూతుర్లకు చెందాల్సిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని తమ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని.. ఇంటికి వెళ్లి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన బలే నరసరాజు టీడీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన…

Read More

Minister Ramprasad Reddy: లోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు..

Minister Ramprasad Reddy: జగన్ రెడ్డి.. లోకేష్ బాబు కాలి గోటికి కూడా సరిపోడని.. జగన్ లో ఉన్న అహాకారం.. నీచ లక్షణాల్లో ఒక్కటి కూడా లోకేష్ లో లేవని.. మంత్రిగా లోకేష్ బాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజల శ్రేయస్సుకోసం పనిచేస్తున్నారని.. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికో పదిరోజులకో బెంగళూరునుండి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి అవాకులు చవాకులు పేలిపోవడం కంటే సిగ్గుమాలిన చర్య…

Read More

Perni Nani: ఇదేమన్నా రాష్ట్ర సమస్యా.. జగన్ బెయిల్ రద్దు చేయటం కోసం చేస్తున్న కుట్ర

Perni Nani: జగన్‌ కుటుంబ విషయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోదని.. కానీ తల్లి, చెల్లిపై జగన్ కేసు వేసాడనీ ఇది భూమి బద్దలయ్యే విషయంగా టీడీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌పై విషం చిమ్మేలా ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మరణానికి ముందే జగన్, షర్మిలకు ఆస్తులు కేటాయింపు జరిగిందన్నారు. తర్వాత జగన్ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుతో అనేక…

Read More