Home » Andhra Pradesh » Page 2

Minister Ramprasad Reddy: లోకేష్ కాలిగోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు..

Minister Ramprasad Reddy: జగన్ రెడ్డి.. లోకేష్ బాబు కాలి గోటికి కూడా సరిపోడని.. జగన్ లో ఉన్న అహాకారం.. నీచ లక్షణాల్లో ఒక్కటి కూడా లోకేష్ లో లేవని.. మంత్రిగా లోకేష్ బాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజల శ్రేయస్సుకోసం పనిచేస్తున్నారని.. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారానికో పదిరోజులకో బెంగళూరునుండి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి అవాకులు చవాకులు పేలిపోవడం కంటే సిగ్గుమాలిన చర్య…

Read More

Pawan Kalyan: అమరావతి రైల్వే లైన్.. అభివృద్ధికి, పారిశ్రామిక, ఉపాధి కల్పనకు బాటలు వేసే మార్గం

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రూ.2,245 కోట్ల నిర్మాణ వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర…

Read More

Perni Nani: ఇదేమన్నా రాష్ట్ర సమస్యా.. జగన్ బెయిల్ రద్దు చేయటం కోసం చేస్తున్న కుట్ర

Perni Nani: జగన్‌ కుటుంబ విషయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోదని.. కానీ తల్లి, చెల్లిపై జగన్ కేసు వేసాడనీ ఇది భూమి బద్దలయ్యే విషయంగా టీడీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌పై విషం చిమ్మేలా ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మరణానికి ముందే జగన్, షర్మిలకు ఆస్తులు కేటాయింపు జరిగిందన్నారు. తర్వాత జగన్ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుతో అనేక…

Read More

CM Chandrababu: సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

CM Chandrababu: జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి రామానాయుడుతో పాటు జిల్లాల నుంచి వచ్చిన ఇరిగేషన్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి…సాధ్యమైనంత త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేపట్టారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్…

Read More

Deputy CM Pawan Kalyan: వన్యప్రాణులను వేటాడేవారిపై కఠినంగా వ్యవహరించాలి..

Deputy CM Pawan Kalyan: చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుత పులులను చంపుతున్న ఘటనలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్\ఆదేశించారు. చిరుత పులిని దారుణంగా చంపిన ఘటనపై మంగళవారం సాయంత్రం అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకొన్నారు. చిరుతను చంపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతపులి దాని గోళ్ల కోసం నాలుగు కాళ్లను విరిచేశారని, దాని దంతాలు కూడా తొలగించారని తెలుసుకొని ‘ఇది…

Read More

AP CM Chandrababu: 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ.. దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం..

AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్యత్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్షన్స్‌లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రివ‌ర్యులు బీసీ…

Read More

Pinipe Srikanth: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

Pinipe Srikanth: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. రెండేళ్ల క్రితం నాటి వాలంటీర్ హత్య కేసులో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులకు అసభ్యకరంగా మెసేజ్‌లు చేసాడనే కారణంగానే శ్రీకాంత్ కిరాయి మూకలతో హత్య చేయించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇది రాజకీయ…

Read More

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు

Andhra Pradesh: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం…

Read More
YS Jagan: ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తోంది.. జగన్ ట్వీట్

YS Jagan: ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తోంది.. జగన్ ట్వీట్

YS Jagan: పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట.. ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు సర్కారు తీరు అలాగే ఉందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. అందుకే ఆయననే అడుగుతున్నా రాష్ట్రంలో…

Read More
Minister Gottipati Ravi Kumar: మున్సిపాలిటీ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష

Minister Gottipati Ravi Kumar: మున్సిపాలిటీ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష

Minister Gottipati RaviKumar: అద్దంకి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మంచి నీటి సరఫరా, రహదారులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి పెట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు సూచించారు. పట్టణ వీధుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా శుభ్రం చేయాలని తెలిపారు. పట్టణ ప్రజలకు సురక్షిత…

Read More

Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందిస్తాం..

Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరందించి రైతులకు మేలు చేకూర్చుతామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా కాలువలు మరమ్మతులకు నోచుకోలేదని, ఫలితంగా నీళ్లు వృధా అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంతమాగలూరు మండలం, అడవిపాలెం గ్రామం నుంచి 35 కి.మీ. మేర ప్రవహిస్తూ, దాదాపు లక్షా 80 వేల ఎకరాలకు నీళ్లు అందించే అద్దంకి బ్రాంచ్…

Read More

Minister Gottipati Ravikumar: విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం..

Minister Gottipati Ravikumar: విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు….

Read More
Mumbai Actress Case: ముంబై నటి కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

Mumbai Actress Case: ముంబై నటి కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

Mumbai Actress Case: ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాలున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జత్వానీపై నిబంధనలకు విరుద్దంగా…

Read More