Bangladesh Women Claim Victory Over Pakistan in T20 Warmup Match:
మహిళల టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ లో పాక్ పై బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్థాన్ మహిళల జట్టుపై తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు 140 పరుగుల భారీ స్కోరు చేశారు. 140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 117 పరుగులకే ఆలౌటైంది. 23 పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది.
ICC women T20 worldcup 2024 లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు వర్సెస్ పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు మధ్య సెప్టెంబర్ 30 (సోమవారం) దుబాయ్ లోని సెవెన్స్ స్టేడియంలో ఏడో వార్మప్ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్థాన్ మహిళల జట్టుపై తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు 140 పరుగుల భారీ స్కోరు చేశారు. 140 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 117 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా 23 పరుగుల తేడాతో విజయం సాదించింది. పాక్ పై విజయం సాధించిన తర్వాత బంగ్లా టీం కు ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆరంభంలో బంగ్లా ఓపెనర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. శాంతి రాణి 16 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించింది. నిసా సుల్తానా 22 బంతుల్లో 18 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ను నిలకడగా కొనసాగించింది. 17 బంతుల్లో 28 పరుగులు చేసిన షర్నా అక్తర్ బంగ్లా ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించింది. చివరి ఓవర్లో 3 ఫోర్లు కొట్టి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది.
పాక్ బౌలింగ్‌లో సాదియా ఇక్బాల్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టింది. ఒమైమా సోహైల్ కూడా సమర్థవంతంగా బౌలింగ్ చేసి 2 ఓవర్లలో 12 పరుగులిచ్చి 1 వికెట్ తీయగా, నిదా దార్ 3 ఓవర్లలో 15 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు.
పాకిస్తాన్ మహిళల వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల వార్మప్ మ్యాచ్ స్కోర్‌కార్డ్
బంగ్లాదేశ్ మొత్తం స్కోరు: 140/7 (షర్నా అక్తర్: 28* , శాంతి రాణి 23 , నైసా సుల్తానా 18 పరుగులు)
పాక్ బౌలింగ్: సాదియా ఇక్బాల్ 2 , ఒమైమా సోహైల్ 1, నిదా దార్ 1 వికెట్
పాకిస్థాన్ మొత్తం స్కోరు: 117/10 (18.4), ఒమైమా సోహైల్ 33 పరుగులు, ఫాతిమా సనా 17 పరుగులు, గుల్ ఫిరోజా 17 పరుగులు
బంగ్లా బౌలింగ్: షోర్నా అక్తర్ 2/16, రబేయా ఖాతూన్ 2/29, ఫహీమా ఖాతూన్ 2/32
140 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బలంగా రాణించినా బంగ్లా బౌలర్లు 117 పరుగులకే పాక్ బ్యాట్స్ మెన్ ను ఆలౌట్ చేశారు. ఇందులో షోర్నా అక్తర్ 2/16, రబేయా ఖాతూన్ 2/29, ఫహీమా ఖాతూన్ 2/32తో రాణించారు. ఈ మ్యాచ్ లో బంగ్లా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించి మ్యాచ్ ను గెలిపించింది. ఈ విజయం ప్రపంచకప్ సన్నాహకాల్లో బంగ్లాదేశ్ కు సానుకూల సంకేతం.