Minister Gottipati Ravikumar: స్వర్ణాంధ్ర-2047 విజన్ అభివృద్ధితో భవిష్యత్ తరాలకు ఎంతో ప్రయోజనం
Minister Gottipati Ravikumar: స్వర్ణాంధ్ర-2047 విజన్ అభివృద్ధి రాబోయే పౌరులకు ఎంతో ప్రయోజనంగా మారనుందని రాష్ట్ర ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్వర్ణాంధ్ర 2047 జిల్లా స్థాయి అవగాహన సదస్సు మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళుతుందని రాష్ట్ర మంత్రి రవికుమార్ చెప్పారు. అధికారులు బాధ్యతతో శ్రమిస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలమన్నారు.
మన దేశంలో అధికంగా ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రాబోయే పౌరులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. బకింగ్ హామ్ కెనాల్ అభివృద్ధి చేసుకోగలిగితే బోట్ల ద్వారా రవాణా పెరుగుతుంది ఆదాయ వనరుగా మారుతుందన్నారు.
తద్వారా కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చన్నారు. 13వ శతాబ్దం నాటి మోటుపల్లి ఓడరేవును పునఃనిర్మించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందాలి, మరుగుదొడ్లు ఉంటేనే స్వచ్ఛత అమలవుతుందని సూచించారు. విద్యతోనే ప్రజలలో అంతరాల అడ్డు నూరు శాతం తొలగిపోతుందన్నారు.
విద్యా రంగంలో పాఠ్యాంశాలు మారాలి, అభివృద్ధికి తగినట్టుగా విద్యా విధానంలో మార్పులు జరగాలని కోరారు. ప్రపంచీకరణ వ్యవస్థతో పోటీపడేలా యువత అభివృద్ధి జరగాలంటే విద్యారంగం సంస్కృతి మారాలని చెప్పారు.
బాపట్ల జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాలలో ఉత్పత్తులు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రచించడం అభినందనీయమని మంత్రి రవికుమార్ చెప్పారు.
వ్యవసాయంపై ఆధారపడిన బాపట్ల జిల్లాలో చివరిలో ఉన్న ప్రతి ఎకరాకు నేరు అందిస్తే ఉత్పత్తులు మరింత పెరుగుతాయన్నారు. సాంకేతిక ఆధునీకరణలను వ్యవసాయ రంగంలోకి తెస్తే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు.
పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగ సమస్య తీరుతుందని, ఉపాధి, ఆదాయ వనరులు పెరుగుతాయన్నారు. బీచ్ ల వద్ద సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దీంతో వారానికి 2000 నుంచి 10000 మంది పర్యాటకులు వస్తారన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణ చేపట్టాలన్నారు.
పేదరిక నిర్మూలన లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల జీవనం మెరుగుపడాలని సూచించారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు.
అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించడం అభినందనీయం అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్లడానికి చర్యలు తీసుకుంటుందన్నారు.
మార్పు దిశగా అందరూ ముందుకు సాగాలని, యంత్రంగం తమ వంతు సహాయ సహకార అందించాలన్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి జరిగితే జిల్లా, రాష్ట్రం, దేశం పురోభివృద్ధిలో పయనిస్తుందన్నారు.
స్వర్ణాంధ్ర దిశగా బృహత్తరమైన ప్రణాళిక, మంచి ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి సీఎం తీసుకువెళ్తున్నారని వివరించారు. అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని అభివర్ణించారు. ప్రజలకు మెరుగైన జీవనం అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
వికసిత భారత్ 2047 దిశగా అందరూ అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్యం, విజన్ బాపట్ల దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.
ప్రజల తలసరి ఆదాయం రూ.1.84 లక్షలు ఉండగా, రూ.15 లక్షలకు పెరగాలని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి మోదీ మిషన్ మోడ్ లో పనిచేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు.
బాపట్ల జిల్లాలో వ్యవసాయ రంగానికి రూ.19,260 కోట్లు వార్షిక ఆదాయం వస్తుందని, పరిశ్రమల ద్వారా రూ.5,526 కోట్లు ఆర్సిక ఆదాయం వస్తుందన్నారు. సేవా రంగం ద్వారా రూ.9,549 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. మొత్తంగా జిల్లా వార్షిక ఆదాయం రూ.34,336కోట్లు వస్తుందన్నారు.
కేవలం వచ్చారంగం ద్వారానే రూ.7,734కోట్లు మహర్షి కాదాయం వస్తుందన్నారు. ఖనిజ సంపద ద్వారా జిల్లాకు రూ.694 కోట్లు వార్షిక ఆదాయం లభిస్తుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ బాపట్ల ప్రణాళికలో 50 వేల మంది క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారని ఆయన వివరించారు.
చీరాల ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్యశాలగా అభివృద్ధి చేస్తామన్నారు. పరిశుభ్రమైన తీర ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో బౌద్ధ స్తూపం, సూర్యలంక బీచ్, చీరాల ఓడరేవు, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వంటీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన వివరించారు.
సమగ్ర ప్రణాళిక అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో అడుగులు వేయాలని ఆయన సూచనలు చేశారు. సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
భవిష్యత్తు తరాలకు అందరూ కలిసికట్టుగా తోడ్పాటునందించాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. సూక్ష్మ ప్రణాళికతోనే అభివృద్ధిని సాధించగలమన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు. ప్రతి ఎకరాకు నీరందిస్తేనే ఇది సాధ్యమన్నారు. భవిష్యత్తు తరాలకు అన్ని వనరులు సమకూర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
కోస్తా తీర ప్రాంతంలో ప్రజలందరికీ సురక్షితమైన తాగు నీరు సమృద్ధిగా అందించగలిగితే అభివృద్ధి బాటలోకి బాపట్ల జిల్లాలో అడుగులు వేస్తోందని చీరాల శాసనసభ్యులు ఎం.మాలకొండయ్య అన్నారు. చేనేత రంగాన్ని ఆధునికీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చించిన అంశాలన్నీ అమల్లోకి తీసుకురావాలన్నారు. మరింత ప్రాణాలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
బాపట్ల జిల్లాలో బీచ్ ల అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో అన్ని రంగాలు అభివృద్ధిలోకి వెళ్తాయని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. అందుబాటులో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేస్తే అభివృద్ధి చాలా సులువేనన్నారు.
2,047 నాటికి మనం ఏం చేయాలి, ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్లాలో ప్రణాళికలతో సాగాలన్నారు. అప్పుడే గాంధీజీ కన్న కలలు సహకారం అవుతాయన్నారు. ఆక్వా పర్యాటక రంగం అభివృద్ధికి మంచి ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.
అనంతరం మత్స్యకారుల కొరకు ఇస్రో రూపొందించిన ట్రాన్స్ పాండర్ లను 150 మంది మత్స్యకారులకు మంత్రులు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 40 వేల రూపాయలు విలువచేసి ఒక్కొక్క యంత్రం పనితీరును వివరించారు.
స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంపై పాఠశాలల్లో ఏర్పాటుచేసిన క్విజ్, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థినిలకు ధ్రువీకరణ పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.