Diabetes మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వంటి అనేక హానికరమైన ఆరోగ్య సంబంధిత వ్యాధులకు ప్రజలు బలైపోతున్నారు. నేటి కాలంలో మధుమేహం ఏ వయసు వారికైనా వస్తుంది. అదే సమయంలో, ఒక వ్యక్తి తన ఆహారం, జీవనశైలిని సకాలంలో మెరుగుపరుచుకుంటే డయాబెటిస్‌ను నివారించవచ్చని నిపుణులు కూడా అంటున్నారు. మధుమేహాన్ని సులభంగా నియంత్రించేందుకు ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ తీసుకుంటే చాలా వరకు డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
మధుమేహం రాకుండా ఉండాలంటే ఈ 5 మిల్లెట్లను తినండి
మిల్లెట్ ఎక్స్పర్ట్ లతా రామస్వామి మాట్లాడుతూ.. మీ ఆహారంలో మిల్లెట్స్(తృణధాన్యాలు)ను చేర్చుకోవడం ద్వారా మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధిని సులభంగా నివారించవచ్చు. మధుమేహం నుంచి బయటపడటానికి, ఆహారపు అలవాట్లను సరిదిద్దడం చాలా ముఖ్యం. అలాగే, బియ్యం , గోధుమలకు బదులుగా మిల్లెట్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచింది. మిల్లెట్లలో కొర్రలు, చామలు, రాగులు, అండు కొర్రలు, సామలు ఉన్నాయి కాబట్టి వాటిని పాజిటివ్ మిల్లెట్స్ అంటారు. ఈ 5 మిల్లెట్లు శరీరంలోని అన్ని భాగాలను లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి.
*కొర్రలు లేదా ఫాక్స్ టైల్ మిల్లెట్
డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో ఫాక్స్‌టైల్ మిల్లెట్ అంటే కొర్రలను చేర్చుకోవాలి. ఈ ధాన్యంలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కొర్రలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవచ్చు. ఇది టైప్ 2 డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
*చామలు లేదా లిటిల్ మిల్లెట్
చామలు లేదా లిటిల్ మిల్లెట్లలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ బి కూడా పెద్ద పరిమాణంలో ఉంటాయి.
*రాగులు లేదా కోడో మిల్లెట్
రాగులు లేదా కోడో మిల్లెట్ మధుమేహానికి మేలు చేస్తాయి. రాగులలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దాని గ్లైసెమిక్ సూచిక కూడా తక్కువగా ఉంటుంది. అలాగే రాగులలో ఉండే ఫైబర్, కార్బొహైడ్రేట్లు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
*అండు కొర్రలు లేదా బ్రౌన్‌టాప్ మిల్లెట్
బ్రౌన్‌టాప్ మిల్లెట్ లేదా అండు కొర్రలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నందున మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
*సామలు లేదా బార్నియార్డ్ మిల్లెట్
సామలలో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండడంతో నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలకు గొప్ప ఎంపిక. హృద్రోగులకు, మధుమేహ రోగులకు ఇది చాలా మేలు చేస్తుంది.
మధుమేహం ఆహారంలో మిల్లెట్లను ఎలా చేర్చాలి..
మిల్లెట్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ఐరన్, ప్రొటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహిత సూపర్ ఫుడ్స్.. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. మిల్లెట్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం, శక్తిని పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మిల్లెట్లను మీ ఆహారంలో పిండి లేదా భోజనం రూపంలో చేర్చవచ్చు.