Home » Ratan Tata Health: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు.. నిజం ఇదే..

Ratan Tata Health: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు.. నిజం ఇదే..

Ratan Tata Health: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు నిజం

Ratan Tata: దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా ఆరోగ్యంపై ఈరోజు పుకార్లు వ్యాపించాయి. రక్తపోటు పెరగడం వల్ల టాటా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఐసీయూలో చేరినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను 86 ఏళ్ల రతన్ టాటా ఖండించారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చానని చెప్పారు. చింతించాల్సిన పనిలేదన్నారు. రతన్ టాటా మార్చి 1991లో దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 2012లో పదవీ విరమణ చేశారు.

రతన్ టాటా తన ప్రకటనలో, “నా ఆరోగ్యం గురించి వ్యాప్తి చెందుతున్న పుకార్ల గురించి నాకు తెలుసు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. వయస్సు రీత్యా, ఆరోగ్య రీత్యా ప్రస్తుతం కొన్ని వైద్యపరమైన పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండమని ప్రజలను, మీడియాను అభ్యర్థిస్తున్నాను.” అని రతన్‌ టాటా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Ratan Tata Health: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు నిజం
Ratan Tata Health: రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు నిజం

ఇదిలా ఉండగా.. రతన్ టాటా అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరారనే వార్తలతో టాటా గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి.టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్‌తో సహా పలు టాటా కంపెనీల షేర్లు క్షీణించాయి. తేజస్ నెట్‌వర్క్, ఆర్ట్సన్ ఇంజినీరింగ్ అత్యధికంగా నష్టపోయాయి. ఇదిలా ఉంటే టాటా కాఫీ, టాటా మెటాలిక్స్, టీసీఎస్ వంటి కొన్ని కంపెనీలు లాభపడ్డాయని తెలుస్తోంది.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *