Home » Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ కు గాయం.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ కు గాయం.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

Rakul Preet Singh: అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అక్కడ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో దూసుకుపోతోంది. నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో కనిపించనుంది. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం, ఇందులో ఆమెతో పాటు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ కూడా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నటి రకుల్ ప్రీత్ గాయపడినట్లుగా తెలిసింది. జిమ్ లో వర్కవుట్స్ చేసే రకుల్ ప్రీత్ ఇటీవల వెన్నెముక గాయంతో బాధపడుతున్నట్లుగా తెలిసింది.


రకుల్‌ప్రీత్ ఎలా గాయపడింది?
వాస్తవానికి, నటి జిమ్‌లో 80 కిలోల డెడ్‌లిఫ్ట్ చేయడం వల్ల ఆమె వెనుక భాగంలో గాయమైంది. నటి గత వారం రోజులుగా బెడ్ రెస్ట్‌లో ఉంది. నెమ్మదిగా కోలుకుంటోంది. రకుల్ 80 కేజీల బరువును లిఫ్ట్ చేస క్రమంలో గాయం అయినట్లుగా తెలిసింది. అయితే ఆమె వర్కవుట్ బెల్ట్ పెట్టుకోకుండా ఇంత బరువు లిఫ్ట్ చేయడంతోనే ఇలా జరిగిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వైద్యులు ఆమెను పరిశీలించి కొన్ని వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ కొన్ని వారాల పాటు ఇంటికే పరిమితం కానుంది. ఇదిలా ఉండగా.. ఆమెకు గాయమై 2 వారాలపైనే అయిందని.. వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని బాలీవుడ్ మీడియా అంటోంది. మరోవైపు రకుల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


‘దే దే ప్యార్ దే 2’ 2019 చిత్రం ‘దే దే ప్యార్ దే’ యొక్క సీక్వెల్ అని తెలిసిందే. ఈ చిత్రం మే 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ చిత్రం గిల్లితో నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిమాన్ష్ ఖురానాతో కలిసి ‘యారియాన్’ ద్వారా హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం 2014లో విడుదలైంది. ఇటీవల తమిళంలో కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌ 2’ చిత్రంలో నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *