Home » Pushpa2 Trailer Launch: నార్త్‌ ఆడియన్స్‌ ని టార్గెట్ చేస్తున్న పుష్పరాజ్.. ట్రైలర్ లంచ్ ఎక్కడో తెలుసా..?

Pushpa2 Trailer Launch: నార్త్‌ ఆడియన్స్‌ ని టార్గెట్ చేస్తున్న పుష్పరాజ్.. ట్రైలర్ లంచ్ ఎక్కడో తెలుసా..?

Pushpa2 Trailer Launch: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప ది రూల్ ” ఇంతకు ముందు వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గ ఈ చిత్రం తెరకెక్కుతుంది. పుష్ప మూవీకి నార్త్ లో మంచి రెస్పాన్స్ రావడంతో అక్కడ కూడా ఈ సీక్వెల్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా నార్త్ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే నార్త్ ఆడియన్స్ ని టార్గెట్గా చేసుకున్న ఈ సినిమా యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన పుష్ప ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ట్రైలర్ లంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్.

ఆ తర్వాత కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాదులలో ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు కూడా పుష్ప 2 టీం ప్రకటించింది. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం కోసం మాసివ్ ఈవెంట్స్ లేనప్పుడు ఉన్నాయని వెల్లడిస్తూ ఒక వీడియోస్ సైతం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తుండగా, సునీల్, అనసూయ సహా అనేకమంది స్టార్ నటీనటులు భాగమైన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని నార్త్ లో అనిల్ తడానికి చెందిన ఏ ఏ ఫిలిమ్స్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన పేరు మీద నమోదు చేసిన పుష్పరాజ్ ఇక రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డ్స్ కొల్లగొడతాడో చుడాలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *