Home » Rice Harvesting: వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Rice Harvesting: వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Rice Harvesting: సాగునీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు చాలా వరకు వరిపంటను అత్యధికంగా సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. పంట కోత సమయంలో చిన్న చిన్న మెళకువలు పాటిస్తే నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చు. వరికోతల సమయంలో ధాన్యంలో తేమ శాతం చూసుకోవడం, హార్వెస్టింగ్ లో విత్తనాలు కల్తీ కాకుండా జాగ్రత్తపడాలి. ఈ అంశాలపై శ్రద్ధ పెడితేన నాణ్యమైన ధాన్యాన్ని మార్కట్లోకి తరలించలించగలుగుతారు. పంట కోతకొచ్చిన సమయంలో కోతలు చేపట్టకపోతే రైతులు నష్టపోయే ఆస్కారం ఉంది. వరి చేను పూర్తిగా ఎండినా, పండువారినా గింజలు రాలుతా


పంట చేతికొచ్చినప్పటి నుంచి కోతలు, ధాన్యం నిల్వ చేయడం వంటి వాటిపై రైతులు అవగాహన పెంచుకోవాలి.నాణ్యమైన పంట ఉంటేనే మంచి ధర లభిస్తుంది. ధాన్యం చాలా నెలలు నిల్వ చేయబడుతుంది. వరి చేను పండువారిన తరువాత, కోతకు 15 రోజుల ముందు నీటిపారుదల నిలిపివేయాలి. వరికంకులకు ఉన్న చివరి గింజ పాలుతాగి పసు పెక్కే వరకూ పంట కోయొద్దు. ముందే కోస్తే తాలు గింజలవుతాయి. అలాగే మంచు కురిసే సమయాల్లో కోస్తే గింజలు మెత్తబడి ధాన్యం నలుపుగా మారుతుంది. ఇ లా అని కోతలు ఆలస్యమైతే ఎండకు గింజ పగుళ్లు వచ్చి వడ్లు నూక అవుతాయి.


వరి పొలంలో 80-90 శాతం వెన్నులు పసుపు రంగులోకి మారుతున్న సమయంలో పంటను కోయాలి. పంట పూర్తిగా ఎండిపోయే వరకు ఉండకూడదు. ఈ దశలో గింజల్లో సుమారు 18-20 శాతం తేమ ఉంటుంది. గింజల్లో తేమ శాతాన్ని తగ్గించడానికి వరి మెదలను 2-3 రోజులు చేనుపై ఎండనివ్వాలి. ఆ సమయంలో వర్షం కురిస్తే 5 శాతం ఉప్పు ద్రావణాన్ని మెదలపై పిచికారీ చేయాలి. అవకాశం ఉన్నచోట హార్వెస్టర్‌తో కోత. నూర్పిడి చేస్తే చెత్త, దుమ్ము, మట్టిపెడ్డలు వంటివి ధాన్యంలో కలువకుండా చూడవచ్చు. హార్వెస్టర్‌తో పంటను కోసినప్పుడు రెండు వేర్వేరు రకాల ధాన్యం కలువకుండా జాగ్రత్త పడాలి.

వరి కోత తర్వాత వరి శుభ్రంగా తూర్పార బోసి చెత్త, మట్టి వంటి వాటిని వేరు చేయాలి. తూర్పార పట్టిన ధాన్యంలో తేమ 12-14 శాతానికి తగ్గేలా ఆరబెట్టాలి. ధాన్యాన్ని పలుచగా ఆరబోయాలి. అలా చేస్తే ధాన్యంలోని తేమ త్వరగా ఆరిపోతుంది. ఆ ఈ విధంగా చేయడం వల్ల ధాన్యం ఎక్కవ రోజులు నిల్వ ఉంటుంది. సరైన తేమ శాతం వచ్చే వరకు ఆరబెడితే ధాన్యం నూకలు అయ్యే అవకాశాలు తగ్గుతాయి. చవుడు నేలల్లో పండించిన ధాన్యాన్ని మంచి ధాన్యంలో కలుపరాదు. చీడపీడలు ఆశించిన మరియు, రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంలో కలువకుండా జాగ్రత్త తీసుకోవాలి. ధాన్యంలో కలుపు మొక్కల గింజలు లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం అక్కడక్కడ మబ్బులతో కూడిన వాతావరణం ఉండి చిరుజల్లులు కురుస్తున్నందున కల్లాల్లో ఉన్న వరి ధాన్యం కుప్పలను టార్బాలిన్‌ కవర్లు లేదా వరి గడ్డిని మందంగా కప్పి తడవకుండా జాగ్రత్త పడాలి.


ధాన్యం నిల్వ చేసేటప్పుడు అధిక తేమ లేకుండా చూసుకోవాలి. ధాన్యాన్ని ఆశించే కీటకాల నుంచి రక్షణ కోసం పొగబెట్టుట మంచిది. పరిశుభ్రమైన గోనె సంచుల్లో లేదా గుమ్ముల్లో ధాన్యం నిల్వ చేసుకోవాలి. అదే విధంగా ఎలుకలు, సూక్ష్మజీవులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ 17 శాతం లోపు ఉంటేనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. సన్నరకం ధాన్యాన్ని కొంత మంది రైతులు ఇండ్లలో నిల్వ చేసుకుంటారు. ఈ సమయంలో బస్తాలను నేల మీద కాకుండా చెక్క బల్లాలపై నిల్వ చేసుకుంటే ఎలుకల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటే బస్తాలపై లీటరు నీటికి 5 మి. లీ. మలాథియాన్ మందును పిచికారీ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *