Posani Krishna Murali: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి రాజకీయాలను మాట్లాడనని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించనన్నారు. నన్ను ఎవరు ఏమనలేదు.. ఎవరి గురించి ఇక నుంచి మాట్లాడనన్నారు.పదహారేళ్ల క్రితం నుంచి తాను తన కుటుంబాన్ని పట్టించుకోలేదన్నారు. రెండ్రోజుల క్రితం నా చిన్న కొడుకు అడిగాడు.. డాడీ నన్నెందుకు పట్టించుకోలేదంటూ అడిగాడన్నారు. రాజకీయాలు చేయడానికి చాలా మంది ఉన్నారని చెప్పాడని తెలిపారు.
పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ అంటావు.. మరి ఫ్యామిలీ ఏంటని అడిగాడన్నారు. నేను ఓ పార్టీని తిట్టాలని పొగడాలని రాజకీయాల్లోకి రాలేదని పోసాని స్పష్టం చేశారు. ఓటర్ లాగే ప్రశ్నించాను.. ఎవరు మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశానన్నారు. నా కుటుంబం కోసం.. నా పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నానని పోసాని ప్రకటించారు. ఎవరు కేసులు పెట్టినా.. దాడులు చేసిన తాను భయపడనన్నారు. ఇక నుంచి నా బిడ్డలు.. నా కుటుంబం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తున్నానన్నారు. “జగన్ ఐ లవ్ యూ జగన్ నేను ఏది అడిగితే ఇచ్చారు.. రెండు లక్షలు పెట్టి బాబు గురించి ఫుల్ పేజి రాశా.. ఆయన మంచి పనులన్నీ అందులో రాశాను.. ఇక నుంచి నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు..వైసీపీ లోనే కాదు ఇప్పటి వరకు నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు.” అని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.