Home » Paralympics 2024: భారత్‌కు పతకాల పంట.. ఖాతాలో 25వ పతకం

Paralympics 2024: భారత్‌కు పతకాల పంట.. ఖాతాలో 25వ పతకం

Paralympics 2024: India Wins 25 Medals | Kapil Parmar Creates History

Kapil Parmar creates history, wins India’s first-ever Paralympic medal in Judo, India got 25 Medals

Paralympics 2024: క్లబ్ త్రో ఈవెంట్‌లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణం, రజతం రెండింటినీ గెలుచుకోవడంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత ప్రదర్శన మరింత ఊపందుకుంది. అంతేకాదు ఈ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన ధరంబీర్ ఆసియా రికార్డును కూడా బద్దలు కొట్టాడు. పురుషుల క్లబ్ త్రో F51 ఈవెంట్‌లో ధరంబీర్ తన ఐదో ప్రయత్నంలో 34.92 మీటర్ల బెస్ట్ త్రోతో ఆసియా రికార్డును బద్దలు కొట్టాడు. సుర్మా తన తొలి ప్రయత్నంలో 34.59 మీటర్ల త్రో చేసినా, తర్వాతి ప్రయత్నాల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ విధంగా అతను రజత పతకాన్ని సాధించాడు. సెర్బియాకు చెందిన ఫిలిప్ గ్రోవాక్ తన రెండో ప్రయత్నంలో 34.18 మీటర్లు విసిరి కాంస్యం సాధించాడు. ధరంబీర్ గురువు, 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ కుమార్ సరోహా ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మూడవ భారతీయుడు. అయితే, అతను 23.96 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో చివరి స్థానంలో నిలిచాడు. హర్విందర్-ధరంబీర్ స్వర్ణంతో పారాలింపిక్ పతకాల పట్టికలో భారత్ పెద్ద ఎత్తున దూసుకెళ్లింది.పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఐదవ భారతీయుడిగా ధరంబీర్ నిలిచాడు, అయితే పారిస్‌లో సుర్మా భారత తొమ్మిదవ రజత పతక విజేత.

Paralympics 2024: India Wins 25 Medals | Kapil Parmar Creates History
Paralympics 2024 India Wins 25 Medals | Kapil Parmar Creates History

మరోవైపు జుడో పురుషుల 61 కేజీల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్‌ అయిన కపిల్ పార్మార్ కాంస్యం సాధించాడు. ప్యారిస్ పారాలంపిక్స్‌లో జుడోలో భారత్‌కు ఇది తొలి పతకం. కపిల్‌ పార్మార్ 10-0తో బ్రెజిల్‌కు చెందిన ఎలిల్టన్ డి ఒలివెరాను ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సెమీ ఫైనల్స్‌లో ఇరాన్ ఆటగాడు సయ్యద్ అబాది 0-10తో ఓటమి పాలయ్యాడు. కపిల్ సాధించిన ఈ పతకంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 25కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *