Home » Palak Paneer Recipe in Telugu | సులభంగా వండండి

Palak Paneer Recipe in Telugu | సులభంగా వండండి

Palak Paneer Recipe in Telugu | సులభంగా వండండి

పండుగ సమయంలో  ప్రత్యేక పాలక్ పన్నీర్

పాలక్ పనీర్ ఒక ప్రసిద్ధ శాఖాహార వంటకం,ఇది ఒక రుచికరమైన కూర.దీనిని పండుగల సమయంలో తరచుగా తింటారు.ముఖ్యంగా మాంసాహారం నిషిద్ధంగా భావించే పూజా సమయాలలో ఇది ఇష్టమైన ఆహారం. పాలకూర,  పనీర్  మిశ్రమంతో తయారు చేసిన  ఈ వంటకం రుచితో పాటు  ఆరోగ్యకరమైన పోషణను అందిస్తుంది.పండుగ సీజన్ లో  చపాతీ, నాన్ లేదా జీరా రైస్ తో ఈ వంటకం అద్భుతంగా ఉంటుంది.

 పనీర్ కు కావల్సిన పదార్థాలు:

  •  పాలకూర (తాజా): 2 కట్టలు. 
  • పనీర్: 200 గ్రాములు, ముక్కలుగా కట్ చేయాలి
  • టొమాటోలు : 2, సన్నగా తరిగి పెట్టుకోవాలి
  • ఉల్లిపాయ : 1, సన్నగా తరిగి పెట్టుకోవాలి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
  •  జీలకర్ర : 1 టీ స్పూను
  •  మిరియాల పొడి : 1/2  టీస్పూన్
  • మిరియాల పొడి : 1/2 టీ స్పూన్
  • ధనియాల పొడి: 1 టీస్పూన్
  •  గరం మసాలా: 1/2  టీస్పూన్
  • పాలు లేదా క్రీమ్: 2 టేబుల్ స్పూన్లు
  • నూనె లేదా నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
  • – ఉప్పు: రుచికి తగినంత

 తయారీ:

1. పాలకూర :

–  ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి ఉడికించాలి.తగినన్ని నీళ్లు పోసి   2-3 నిమిషాలు ఉడికించాలి.

– చల్లార్చిన పాలకూరను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.

2. పనీర్ తయారీ:

*  బాణలిలో  1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె వేడి చేసి  పనీర్ ముక్కలను ఎరుపు  రంగులో  వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇలా చేస్తే పనీర్ కు మంచి రుచితో పాటు టెస్ట్ వస్తుంది. 

3. గ్రేవీ తయారీ:

– బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి.

* జీలకర్రను వేసి , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.

– తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ రంగు వచ్చే వరకు వేయించాలి.

–  టొమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి,  మిరియాల పొడి, ఉప్పు వేసి పేస్ట్‌లా చేయాలి. 

 4.పాలకూర  పేస్ట్ కలపడం:

– ఇప్పుడు ఒక బాణలిలో పాలకూర పేస్ట్ వేసి మసాలా దినుసులతో బాగా కలపాలి.  మీడియం మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి.

 5. పనీర్ వేయడం:

– చివరగా వేయించిన పనీర్ ముక్కలను గ్రేవీలో వేసి తక్కువ మంటపై  2-3 నిమిషాలు ఉడికించాలి.

– అందులో పాలు లేదా క్రీమ్ వేసి బాగా కలపాలి.

 6. సర్వింగ్:

– రుచికరమైన రూలింగ్ పనీర్ రెడీ. దీన్ని చపాతీ, నాన్ లేదా అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.

 గమనికలు:

1. ఎక్కువ సేపు ఉడకబెట్టకుండా  పాలకూర రంగు మారకుండా చూసుకోవాలి.

2. పనీర్ మెత్తగా ఉండాలంటే పనీర్ ముక్కలను నీటిలో వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి.

3.  కారం తక్కువ కావాలనుకుంటే కారం పొడిని తగ్గించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *