Nara Brahmani: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని గెలుపు కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి .
ఎన్నికల సందర్భంగా తమను కలిసిన నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు తమ అభ్యర్థనన తెలియజేశారు. కూరగాయలు అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు విన్నవించుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యను అధికారులకు నారా బ్రాహ్మణి చెప్పారు. అయితే తాజాగా సమస్య పరిష్కారానికి కూరగాయల వ్యాపారులకు స్థలాన్ని మున్సిపల్ అధికారులు కేటాయించారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్య పరిష్కారమైందని సంతోషం వ్యక్తం చేశారు కూరగాయల వ్యాపారులు.