Akkineni Nagarjuna: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నాగచైతన్య-సమంత విడాకులకు కారణం కేటీఆరే.. అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఘాటుగా స్పందించారు. ‘కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబంధం, అబద్ధం, తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు.
కొండా సురేఖ కేటీఆర్ పై ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. “నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి, ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్ కు అలవాటు పడి రేవ్ పార్టీలు చేసుకొన్నారు. మదమెక్కి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి వారి లైఫ్ ను నాశనం చేశారు. అంతే కాకుండా గతంలో అక్రమంగా కట్టిన ఎన్ కన్వెన్షన్ ను చూసి చూడనట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసింది. సమంతను కేటీఆర్ రమ్మని పిలిచాడు. నాగార్జున కుటుంబం కూడా వెళ్లమని ఒత్తిడి చేసింది. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో సమంత విడాకులు తీసుకుంది.” అని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి.