Home » Naga Chaitanya-Shobitha: నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్?

Naga Chaitanya-Shobitha: నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్?

Naga Chaitanya-Sobhita పెళ్లి డేట్ ఫిక్స్?

Naga Chaitanya-Shobitha: గత కొద్ది రోజులుగా నాగచైతన్య-శోభిత వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. వారి పెళ్లి ఎప్పుడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్‌ 4న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా మాత్రం ధ్రువీకరించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పసుపు దంచడం మొదలుపెట్టిన శోభిత తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలిపింది. దీంతో అసలు వీరి పెళ్లెప్పుడు జరుగుతుంది అనే విషయం మీద చర్చలు మొదలయ్యాయి. అయితే నాగచైత,న్య శోభిత పెళ్లి ఇప్పట్లో లేదని డిసెంబర్ నెలలో మీరు వివాహం చేసుకోబోతున్నారని దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? హైదరాబాద్‌లోనే చేసుకుంటారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. నాగచైతన్య, శోభిత ఇద్దరూ తమ పెళ్లికి సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా ముందే రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తండేల్ షూట్ పూర్తి చేసిన తర్వాతే వివాహానికి సిద్ధమవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక పెళ్లికి సంబంధించి వీరు అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *