Home » Mutton Bone Soup telugu: మటన్ బోన్ సూప్ – హెల్తీ & టేస్టీ

Mutton Bone Soup telugu: మటన్ బోన్ సూప్ – హెల్తీ & టేస్టీ

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ - హెల్తీ & టేస్టీ

recipes for mutton Bone soup:మటన్ బోన్ సూప్ చాలా టేస్టీగా, హెల్తీగా !

recipes for mutton Bone soup: వారానికి ఒక్కసారైనా మటన్ బోన్ సూప్ తాగడం వల్ల క్యాల్షియం లోపాన్ని నివారించవచ్చు.మటన్ బోన్ సూప్ ను ఎలా రుచికరంగా తయారు చేసుకోవాలో చూద్దాం.

కొందరు మటన్ బొక్కల్ అంటారు, మరికొందరు మటన్ పాయా అంటారు. నిజానికి మటన్ బోన్ సూప్ లో మటన్ బొక్కల్ కలుపుకోవచ్చు. మటన్ పాయలో కాళ్లను మాత్రమే వాడతారు. మటన్ బోన్ సూప్ రెసిపీ చేయడం చాలా సులభం. వారానికి ఒక్కసారైనా మటన్ బోన్ సూప్ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు ,క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి.ఈ మటన్ బోన్ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 

మటన్ బోన్ సూప్ రెసిపీకి కావలసిన ఐటమ్స్…..

  • మటన్ బొక్కల్ – 1/2 కిలో
  • నల్ల మిరియాల పొడి – 1/2 టీస్పూన్
  • బిర్యానీ ఆకులు- 2
  • శెనగపిండి – 1/2 టీ స్పూన్
  • దాల్చిన చెక్క – చిన్న ముక్క
  • యాలకులు – 2
  • లవంగాలు – 2
  • పుదీనా ఆకులు – 1/2 కప్పు
  • కొత్తిమీర  – 1/2 కప్పు
  • కరివేపాకు – గుప్పెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూను
  • ఉప్పు – రుచికి తగినంత
  • జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
  • ధనియాల పొడి – అర టీ స్పూను
  • గరం మసాలా – 1 టీస్పూన్
  • ధనియాల పొడి – 1/2 టీ స్పూను
  • పచ్చిమిర్చి – 3
  • టొమాటోలు – 2
  • తరిగిన ఉల్లిపాయలు – 1/2 కప్పు

recipes for mutton Bone soup…

1.  మటన్ బోన్ సూప్ తయారు చేసే ముందు మటన్ బొక్కల్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో నెయ్యి లేదా నూనె తగినంత వేయాలి.

3.  తర్వాత నెయ్యి/నూనె  లో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా వేసి బాగా వేయించాలి.

4. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు , పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు బాగా వేయించాలి.

5. తర్వాత  మటన్ బొక్కలను కుక్కర్‌లో వేయాలి.

6. తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.

7.  తర్వాత మూత  తీసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.

8.  సన్నగా తరిగిన టమోటాలు వేసి మెత్తగా అయ్యేలా చేయాలి.

9. తర్వాత అందులో  కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

10. తర్వాత పుదీనా ఆకులు, నీళ్లు పోసి  కుక్కర్ పైన మూత పెట్టాలి.

11. కనీసం ఐదారు విజిల్స్ వరకు ఉడికించాలి.

12. తర్వాత మూత తీసి  మిరియాలు, కొత్తిమీర   చల్లి మరికొంత సేపు ఉడికించాలి.

13. మటన్ బోన్ సూప్ రెడీ, వేడి వేడిగా తింటే బాగుంటది.

మటన్ బోన్ సూప్ తాగడం వల్ల జలుబు,  త్వరగా రాకుండా నివారిస్తుంది. హిమోగ్లోబిన్ లెవల్స్ కూడా పెరుగుతాయి. మటన్ బోన్ సూప్ తీసుకోవడంతో కాల్షియంతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇది ఔషధంగా ,రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *