Mumbai Actress Case: ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై అభియోగాలున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జత్వానీపై నిబంధనలకు విరుద్దంగా కేసు నమోదు చేశారని అభియోగం నమోదైంది. తమను ఏపీ పోలీసులు వేధించారంటూ విజయవాడ కమిషనరుకు జత్వానీ కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నాటి సీఎంఓలో కూర్చొనే పీఎస్సార్ జత్వానీ ఎపిసోడ్ నడిపారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కాంతి రాణాను.. విశాల్ గున్నిని ఈ ఏడాది జనవరి 31వ తేదీన పీఎస్సార్ సీఎంఓకి పిలిపించారని తెలిసింది. జత్వానీపై కేసు నమోదుకు ముందే పోలీస్ ఉన్నతాధికారులు ముంబై వెళ్లారని జీవోలో సీఎస్ పేర్కొన్నారు. పర్మిషన్ లేకుండా పీఎస్సార్ నోటి మాట మీదనే ముంబై వెళ్లి ఐపీఎస్‌లు సస్పెండ్ అయ్యారు. ముంబై వెళ్లొచ్చిన టీఏను క్లైమ్ చేయలేదని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్దంగా.. సరైన విచారణ చేపట్టకుండానే కేసు నమోదు చేశారని అభియోగాలు నమోదయ్యాయి.