MLA Koneti Adimulam: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ ఆ పార్టీకి చెందిన జిల్లా మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె.. తాను టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పని చేస్తున్నానని, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతు పాత్ర పోషించినట్లు చెప్పారు. గత సర్కారులో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు వ్యతిరేకంగా తాను ఎన్నో పోరాటాలు చేసినట్లు చెప్పారు. ఆయననే టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడాన్ని టీడీపీ కేడర్ కూడా వ్యతిరేకించినట్లు ఆమె తెలిపారు. అనంతరం టీడీపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా.. కోనేటి గెలుపు కోసం పని చేసినట్లు వెల్లడించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాకా ఆదిమూలం తనపై కక్షగట్టి తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని లేఖలో వరలక్ష్మి చెప్పుకొచ్చారు.
కోనేటి ఆదిమూలం నుంచి కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికీ.. భయపెట్టి లైంగికంగా వేధించాడని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకువచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. లైంగికంగా తన కోరికను తీర్చుకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరించినట్లు ఆమె పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు రావడంతో ఆయనకు బిగ్ షాక్ తగిలింది. తీవ్ర విమర్శల నేపథ్యలో టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది.