Home » Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు..

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాంబులు అంటే బాంబులు వేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. చట్టప్రకారం మేము ముందుకు వెళ్లడం లేదని అంటున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వాళ్లకు అప్పగించాలని అనుకుంటున్నారన్నారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దావత్ లకు పర్మిషన్లు తీసుకోవాలా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ఇప్పుడు స్పెషల్ పోలీసులను తీసివేశారు రేపు ఆర్మ్డ్ పోలీసులు తిరగబడితే ఏం చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి ఆంధ్రా పోలీసులను తెచ్చుకుంటారా అంటూ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ కు జగదీష్ రెడ్డి కౌంటర్ వేశారు. బండి సంజయ్ బీజేపీ నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయారన్నారు. రేవంత్ రెడ్డికి సహాయమంత్రిగా పని చేస్తున్నారన్నారు. కేటీఆర్ పైన బండి సంజయ్ అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాపాడాలని బండి సంజయ్ ఉత్సాహపడుతున్నారని చెప్పారు. బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలన్నారు. కరీంనగర్ లో కార్పోరేటర్ గా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి,బండి సంజయ్ మధ్య ఐఖ్యత ఎక్కడిదన్నారు. డబ్బుల సంచులతో దొరికి రేవంత్ రెడ్డి,పేపర్లు లీక్ చేసి బండి సంజయ్ జైలుకు వెళ్లారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆక్సిజన్ తో నడుస్తోందన్నారు. మిలాఖత్ ఉంటే కేటీఆర్ బామ్మర్ధి ఇంటిపై రేవంత్ రెడ్డి ఎందుకు దాడి చేయిస్తారని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *