Home » Miss Universe 2024: మిస్ యూనివర్స్‌ 2024గా డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్

Miss Universe 2024: మిస్ యూనివర్స్‌ 2024గా డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్

Miss Universe 2024: డెన్మార్క్‌కు చెంది విక్టోరియా కెజార్ థెల్విగ్ 73వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో డెన్మార్క్ నుంచి కిరీటాన్ని కైవసం చేసుకున్న తొలి మహిళగా కూడా ఆమె ఘనత సాధించింది. 21 ఏళ్ల విక్టోరియా మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దాదాపు 125 మంది పోటీపడగా.. ఆమె కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ అందాల పోటీ మెక్సికో సిటీలోని అరేనా CDMXలో జరిగింది. ఆమెకు షెన్నిస్ పలాసియోస్ (మిస్ యూనివర్స్ 2023) కిరీటాన్ని అందజేశారు. మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిన్మా అడెత్షినా నిలిచింది. కాగా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచింది. ఈ పోటీలో భారత్ తరఫున రియా సింఘా పాల్గొన్నారు. కానీ ఆమె టాప్‌ 5లో కూడా నిలవలేకపోయారు.

విక్టోరియా కెజార్ ఎవరు?
విక్టోరియా ఒక డానిష్ వ్యాపారవేత్, వృత్తిపరమైన నృత్యకారిణి. 21 ఏళ్ల విక్టోరియా డెన్మార్క్ తొలి మిస్ యూనివర్స్‌గా చరిత్ర సృష్టించింది. డెన్మార్క్ రాజధాని ప్రాంతంలో సోబోర్గ్‌లోని గ్రిబ్స్కోవ్‌లో 2004లో జన్మించిన విక్టోరియా కోపెన్‌హాగన్‌లో పెరిగింది. ఆమె బిజినెస్, మార్కెటింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. విక్టోరియా ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా అనేక ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఆమె లక్ష్యం న్యాయవాది కావడమే. అదనంగా, ఆమె మానసిక ఆరోగ్య మద్దతు కోసం క్రమం తప్పకుండా వాదిస్తుంది. ఆమె జంతు హక్కుల సమస్యలకు కూడా మద్దతు ఇస్తుంది. అందాల పోటీల్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతో మోడలింగ్‌లో అడుగుపెట్టారు.

2022 నుండి ప్రారంభమైన అద్భుతమైన ప్రయాణం
ఆమె అందాల పోటీ ప్రయాణం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అందాల పోటీ ‘మిస్ డెన్మార్క్’తో ప్రారంభమైంది. 2022లో ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ టాప్ 20లో ప్రవేశించడంతో ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐకానిక్ డాల్‌ను పోలి ఉండటం వల్ల ‘హ్యూమన్ బార్బీ’ అని పిలవబడిన విక్టోరియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసింది. సెప్టెంబర్ 2024లో, విక్టోరియా ‘మిస్ యూనివర్స్ డెన్మార్క్ 2024’ కిరీటాన్ని పొందింది. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్ 2024’ కిరీటాన్ని ధరించి చరిత్ర సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *