Home » Minister Lokesh: బోసన్ మోటార్స్ ఇంటిలిజెంట్ లైట్ ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

Minister Lokesh: బోసన్ మోటార్స్ ఇంటిలిజెంట్ లైట్ ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

Minister Lokesh: ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో జెండా ఊపి నూతన వాహనాన్ని అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఏపీలో పురుడు పోసుకున్న బోసన్ మోటార్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బోసన్ సంస్థ కార్యాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి లోకేష్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్ వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్ మంత్రి లోకేష్‌కు వివరించారు.

ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌కు సంబంధించి రూపొందించిన డెమోను ప్రదర్శించారు. తర్వాత ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమసంస్థ సిరిస్ ఎ స్టార్టప్‌లతో వివిధ రంగాల్లో ఆవిర్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలను వివరించారు. అనంతరం డిజిసెర్ట్ సిఇఓ అమిత్ సిన్హా మంత్రి లోకేష్ ను కలిసి తమ సంస్థ కార్యకలాపాలను తెలియజేశారు. డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతలకు సంబంధించి డిజిసెర్ట్ సురక్షితమైన ఆన్ లైన్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆయా సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయాలని కోరారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలస్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు. ఎపి సిఎం, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వాన ఎపిలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని లోకేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *