Home » Minister Komatireddy: మూసీ ప్రక్షాళన ఆపి చూడండి.. కేటీఆర్, హరీష్.. మీ సంగతి చూస్తా..

Minister Komatireddy: మూసీ ప్రక్షాళన ఆపి చూడండి.. కేటీఆర్, హరీష్.. మీ సంగతి చూస్తా..

Minister Komatireddy: మూసీ ప్రక్షాళన ఆపితే చూస్తా!

Minister Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళన ఆపడానికి చూస్తే సంగతి చూస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు మూసీ ప్రక్షాళనను ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వాళ్లు మూసీ నీళ్లు తాగి చనిపోవాలని కేటీఆర్, హరీష్ రావు కోరుకుంటున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలో రెచ్చగొట్టి శ్రీకాంతాచారి మరణానికి హరీష్‌రావు కారణమయ్యాడని ఆరోపించారు.

మూసీ ప్రక్షాళన ఆపి చూడండి కేటీఆర్, హరీష్ రావు.. మీ సంగతి చూస్తా అంటూ మంత్రి హెచ్చరించారు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్ర సోనియా రాహుల్‌ది అని వెల్లడించారు. శాశ్వతంగా అధికారంలో ఉంటామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనుకున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *