1. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
2. పెండింగ్ లో ఉన్న టన్నెల్ – 2ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
3. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 20 లక్షల మందికి పైగా తాగు నీరు అందించే అవకాశం
4. కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉంది
5. జగన్ రెడ్డి పాలనలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి
6. వైసీపీ హయాంలో సరైన నిర్వహణ లేక అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది
7. గుండ్లకమ్మ , వెలిచెర్ల ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి
8. వెలిగొండని పూర్తిగా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది
9. ప్రాజెక్టు పూర్తి అవ్వగుండా జాతికి అంకితం అని ప్రజలను మోసం చేశారు
10. టన్నెల్స్ లో తవ్విన మట్టి 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడే పడేసి వెళ్లిపోయారు
11. వెలిగొండను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రకాశం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాము.