Home » Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీని కోరింది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాదా?

Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీని కోరింది పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాదా?

Minister Gottipaati Ravi Kumar: తన 5 ఏళ్ల పాలనలో 9సార్లు కరెంటు చార్జీల పెంచి పేదలపై మోయలేని భారం మోపిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. నాడు చంద్రబాబు నాయుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని అప్పగిస్తే వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది మీరు కాదా జగన్? అని ప్రశ్నించారు. నీ అసమర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా? విద్యుత్ హెచ్చుతగ్గులతో ఏపీ జెన్కోని నాశనం చేసింది నువ్వు కాదా ? పీపీఏలను రద్దు చేయడం, ఉత్పత్తిదారులను భయపెట్టడంతో కేంద్ర, విదేశీ బ్యాంకుల వద్ద రాష్ట్రం పరువు తీసింది నువ్వు కాదా? అంటూ వైఎస్ జగన్ ను ఉద్దేశించి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.


2022-23, 23-24 ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రజలపై మోపాలని డిస్కంలకు అనుమతి ఇచ్చింది నువ్వు కాదా జగన్? డిస్కంలు విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ అనుమతి కోరింది నీ హయాంలో కాదా? 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం తాగిన జగన్ మోహన్ రెడ్డా.., చంద్రబాబు నాయుడు పాలనను విమర్శించేది? నువ్వు చేసిన తప్పిదాలతోనే కదా అనవసరంగా హిందూజా పవర్ కు రూ.1200 కోట్లు కట్టాల్సి వచ్చింది? నీ హయంలో ప్రతీ వ్యవస్థ నాశనం అయ్యింది నిజం కాదా? పోలవరం పూర్తి చేస్తాను, మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది నువ్వు కాదా ? తప్పులు అన్నీ వైసీపీ ప్రభుత్వంలో చేసి.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని గొట్టిపాటి రవి కుమార్ జగన్ ని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *