Home » Minister Gottipaati: చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు భేష్

Minister Gottipaati: చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అమలు భేష్

Minister Gottipati: చంద్రబాబు ఆధ్వర్యంలో సంక్షేమ భేష్

Minister Gottipaati Ravi kumar: మూడు పార్టీల నేతలు కష్టపడి పని చేయడం కారణంగానే కూటమి ప్రభుత్వం అత్యధిక మధ్య మెజారిటీతో గెలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. భీమవరంలో నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా కూటమి సభ్యుల ఆత్మీయ సదస్సులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు. ఇంచార్జ్ మంత్రి హోదాలో గొట్టిపాటి రవి కుమార్ తొలిసారి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. ఇందుకుగాను జిల్లాలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో భేటీ అయ్యారు.

ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లాలోని పలు సమస్యలను ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వచ్చే పర్యటన నాటికి సాధ్యమైనన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి నేతలు, కార్యకర్తల మీద ఉందని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3000 ఉన్న పింఛన్ ను ఒక్క సంతకంతో రూ.4000 పెంచామని గుర్తు చేశారు. రూ. వెయ్యి పింఛను పెంచడానికి జగన్ మోహన్ రెడ్డికి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతన్నల భూమి హక్కులను కాపాడామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. 22 ఏ లోని భూముల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాము హామీ ఇచ్చారు. జిల్లాలో ఇసుక సమస్యను స్థానికం నేతలు మంత్రి దృషఅటికి తీసుకురాగా… దీనిపై స్పందించిన మంత్రి సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం సూచిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ట్రాస్స్ ఫార్మాల ఖర్చు మూడు రెట్లు పెంచినట్లు కూటమి నాయకులు తెలుపగా దీనికి సమాధానం ఇస్తూ.. ట్రాన్స్ ఫార్మర్ల ఖర్చును తగ్గించేందుకు తప్పకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం రహదారులను పూర్తిగా పట్టించుకోలేదని దాని ఫలితంగా గుంతల రోడ్లు ఎక్కడ చూసిన దర్శనం ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వాటి మరమ్మత్తులపై అధికార యంత్రాంగం పని చేస్తోంది. కూటమి ప్రభుత్వం దీని కోసం రూ. 800 కోట్లకు పైగా కేటాయించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీ నేతలు అంతా కలిసికట్టుగా పట్టభధ్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ విజయానికి కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. అర్హులు అయిన పట్టభద్రులు అందరూ ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *