Home » Matka Pre Release Event: ‘మట్కా’ 14న థియేటర్స్ లో దుమ్ము దులపబోతోంది: హీరో వరుణ్ తేజ్

Matka Pre Release Event: ‘మట్కా’ 14న థియేటర్స్ లో దుమ్ము దులపబోతోంది: హీరో వరుణ్ తేజ్

Matka Pre Release Event: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానులు సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు హీరో వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి హాజరయ్యారు. ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశారు.

గ్రాండ్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి ఇంతగా అద్భుతంగా సపోర్ట్ చేసిన ప్రేక్షకులు, అభిమానులందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. బర్మా నుంచి వైజాగ్ కి శరణార్థిగా వచ్చిన వాసు అనే కుర్రాడు కథ ఇది. వాసు చిన్నప్పటి క్యారెక్టర్ లో కార్తికేయ నటించాడు. చాలా అద్భుతంగా చేశాడు. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అవినాష్ నాకు తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. తనకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో పనిచేసిన మీనాక్షి చౌదరి గారికి, నోరా గారికి, జాన్ విజయ్, నవీన్ చంద్ర, సత్యం రాజేష్ అందరికీ థాంక్యు. నవీన్ చంద్ర ఫెంటాస్టిక్ యాక్టర్. ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిఓపి కిషోర్ వర్క్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. విజువల్ గా సినిమాని ఇంత గ్రాండ్ గా చేసిన కిషోర్ కి థాంక్యూ. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ అద్భుతంగా వైజాగ్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమాకి కిరణ్ చాలా పెద్ద ఎసెట్. ఎడిటర్ గారికి, మా డైరెక్షన్ టీం కి, మా ప్రొడక్షన్ టీం కి, మా నిర్మాతలకు థాంక్యూ సో మచ్. నిర్మాతలు విజయేంద్ర గారు, రామ్ తాళ్లూరి గారు ఈ సినిమాని డే వన్ నుంచి చాలా పాషనేట్ గా వర్క్ చేశారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దామని భావిస్తున్నప్పుడు కరుణ కుమార్ గారు మట్కా కథతో వచ్చారు. తను అద్భుతమైన మేకర్. మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా అనిపించింది. నాలోని యాక్టర్ ని ఆయన పట్టుకున్నారనిపించింది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ తర్వాత అందరూ కరుణ కుమార్ గారి వర్క్ గురించి మాట్లాడుకుంటారు. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్నప్పుడు రామ్ చరణ్ అన్నయ్య నుంచి మొన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది. అన్నయ్య ఎప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ గా వుంటారు థాంక్స్ చరణ్ అన్న. మా బాబాయ్. పెదనాన్న ఎప్పుడు గుండెల్లో ఉంటారు. నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ రెండు సార్లు మిస్ అయింది. ఈసారి మాత్రం గట్టిగా కొడతాను. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తిని కాదు. కానీ ఈసారి సినిమా చూసి నమ్మకంతో చెప్తున్నాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మీ అందరిని అలరిస్తుంది. నా లైఫ్ లోని హీరోయిన్, నా వైఫ్ లావణ్య ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. తను ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంటుంది. అందరికీ పేరుపేరునా బిగ్ థ్యాంక్స్. నేను మాటలు ఆడడం కంటే నా సినిమా మాట్లాడాలని భావిస్తాను. నా టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్స్. మట్కా 14న వస్తుంది. ధియేటర్స్ లో దుమ్ము దులపపోతుంది. ఇది మాత్రం గ్యారెంటీ. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. విశాఖపట్నం అంటే సముద్రం గుర్తుకు రావాలి, లేదా ఈ వాసు గాడు గుర్తుకు రావాలి. వాసు గాడు రేపు థియేటర్లో మిమ్మల్ని ఒక మంచి ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లబోతున్నాడు. వాడితో పాటు ట్రావెల్ అవుతారు. ఒక మంచి సినిమా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా టీమంతా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు’ అన్నారు.

నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విజయేందర్ రెడ్డి గారితో కలిసి సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ గారు చాలా కూల్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారికి వరుణ్ బాబు గారికి 100% మ్యాచింగ్ ఉంది. మట్కా తర్వాత వరుణ్ తేజ్ గారు వన్ అఫ్ ది బిగ్గెస్ట్ మాస్ హీరో ఇన్ ది తెలుగు ఇండస్ట్రీ అవుతారు. ఇందులో వరుణ్ తేజ్ గారి పెర్ఫామెన్స్ చూసాను. మార్కెట్లో ఫైట్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. వైజాగ్ ని రీ క్రియేట్ చేశారు. దాని వెనక చాలా కృషి ఉంది. డైరెక్టర్ గారు ఎంతో రీసెర్చ్ చేసి కథను రాసుకున్నారు. టీం చేసిన హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా నవంబర్ 14 ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ వేడుకకి విచ్చేసిన లావణ్య గారికి థాంక్యూ సో మచ్’ అన్నారు

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. గుడ్ ఈవెనింగ్ వైజాగ్. నేను వైజాగ్ అల్లుడిని. దొండపర్తి మా అత్తగారి ఊరు. నా గ్రోత్ ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఈ వేడుకలో ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. నిర్మాతలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వైజాగ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నాను. ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదల వైజాగ్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక పవర్ హౌస్ గా నిలిచింది. ఇంత దూరం వచ్చిందంటే దీని వెనక చాలామంది మనుషులు ఉన్నారు. వైజాగ్ లో పుట్టి పెరిగిన వారి జీవితాలు చాలామందికి తెలియదు. ఆ జనరేషన్ ని మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దామనుకున్నాను. మట్కా వైజాగ్ లో ఒకప్పుడు జరిగిన కథ. వైజాగ్ లో నైట్ క్లబ్లు ఉండేవి క్యాబ్రీలు ఉండేవి. అప్పటి మనుషులు అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప ఎచీవ్మెంట్లు అన్నీ చూపించాలనుకున్నాను. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. వైజాగ్ లో సామ్రాజ్యాల స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్లందరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మట్కా చేయడం జరిగింది. కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్ లోనే వరుణ్ గారు ఓకే చేశారు. ఇప్పుడు నవంబర్ 14 కి మీ ముందుకు వస్తుంది. మీరంతా చూసి ఈ సినిమాని ఆశీర్వదించాలి. ఈ సినిమా గ్రోత్ గురించి మాట్లాడుతుంది. మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. నా విజయాన్ని నా విజన్ కి తెరరూపం ఇచ్చిన మా డిఓపి కిషోర్ కి కృతజ్ఞతలు. అప్పటి వైజాగ్ ని క్రియేట్ చేసిన ఆర్ట్ దైరేల్టార్ కిరణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ప్రొడక్షన్ టీం కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నేను మెగా ఫ్యాన్ ని. ఒక మెగా అభిమానిగా నేను ఈరోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ ని డైరెక్ట్ చేయడం నా సక్సెస్ లో ఒక మైస్టోన్ అనుకుంటున్నాను. మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ వరుణ్ బాబు గారు. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో అనే ఆలోచన వుండేది. కానీ రెండో రోజే ఆ ఆలోచనలన్నీ పోయాయి. వరుణ్ తేజ్ గారికి శుభ్రత అంటే ఇష్టం. కానీ అలాంటి వ్యక్తి నేల మీద కూర్చోమంటే కూర్చున్నారు. బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవమంటే తడిసారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కరోజు కూడా కంప్లీట్ చేయకుండా వర్క్ద్ చేశారు. ఈ సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్ట్ నా భూతో నా భవిష్యతి. ఇది నా ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను. వరుణ్ గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మీరంతా ఆనందపడతారో, ఆయన ఎలాంటి ఫైట్లు డాన్సులు చేయాలనుకుంటున్నారో, అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో సింగిల్ షాట్ లో ఒక సీన్ ఉంటుంది. అది తెలుగు సినిమాలో నిలబడి పోయే సీన్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు హీరో గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రైమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మీనాక్షి నోరా జాన్ విజయ్ వీళ్ళ అందరి పెర్ఫార్మన్స్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అందరికీ నా కృతజ్ఞతలు. నవంబర్ 14న సినిమాని థియేటర్లో చూడండి. విజయవంతం చేయండి’ అన్నారు

నిర్మాత రజినీ తాళ్లూరి మాట్లాడుతూ.. ముందుగా విజయ్ గారికి థాంక్ యూ. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. డిఓపి కిషోర్ గారు హీరో గారిని చాలా అద్భుతంగా చూపించారు. టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. మీనాక్షి. నోరా చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. డైరెక్టర్ కరుణకుమార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయనకి 24క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంది. ఆయన టీం చాలా కష్టపడి వర్క్ చేసింది. హీరో వరుణ్ గారు చాలా సపోర్ట్ చేశారు. కాకినాడలో చేసిన క్లైమాక్స్ షూట్ లో డే అండ్ నైట్ కష్టపడి ఎక్కడా బ్రేక్ లేకుండా పనిచేశారు. థాంక్యూ వరుణ్ గారు. రామ్ గారికి థాంక్ యూ. అందరికీ థాంక్యు సో మచ్’అన్నారు

నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ.. గుడ్ ఈవెనింగ్ వైజాగ్. మా బ్యానర్ లో జరిగిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హాయ్ నాన్నకి వైజాగ్ వచ్చాము. మీరు గొప్పగా ఆదరించారు. మట్కా సినిమా నిన్ననే చూశాను. వరుణ్ తేజ్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. మెగా ఫాన్స్ తొడగొట్టి చెప్పొచ్చు. వాసు క్యారెక్టర్ జీవితాంతం గుర్తుండిపోతుంది. కరుణ్ కుమార్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. మనసుపెట్టి ఈ సినిమాని చేశారు, నోరా, మీనాక్షి, మిగతా యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ థాంక్ యూ. ప్రేక్షకులు నవంబర్ 14న ఈ సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

యాక్టర్ నవీన్ చంద్ర మాట్లాడుతూ.. వైజాగ్ కి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ టైంలో మీరు చేసిన హడావిడి నా జీవితంలో మర్చిపోలేను. నేను చేసిన సినిమాలు, పాత్రలని ఆదరించినందుకు థాంక్యూ సో మచ్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది వరుణ్ తేజ్ గారు, కరుణ కుమార్ గారు. వరుణ్ గారు గని సినిమాలో నాకు ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. మట్కాలో ఈ పాత్రని బాగా చేస్తాని నమ్మి కరుణ కుమార్ గారు అండ్ టీం ఈ అవకాశం ఇచ్చారు. ఈ పాత్రకు నేను న్యాయం చేశానని నమ్ముతున్నాను. నిర్మాతలకు టీమ్ అందరికీ థాంక్యు. మట్కా లో వరుణ్ తేజ్ గారు మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. ఒక యాక్టర్ కి అది అంత ఈజీ కాదు. వరుణ్ గారు చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఈ కథ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కరణ కుమార్ గారు అద్భుతంగా తీశారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. నవంబర్ 14న ఈ సినిమాని మిస్ కావద్దు’ అన్నారు.

యాక్టర్ జాన్ విజయ్ మాట్లాడుతూ.. నా వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు చాలా న్యూ లుక్ ఇచ్చారు. నిర్మాతలకు థాంక్యూ. వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. చాలా అద్భుతమైన నటుడు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్’అన్నారు.

యాక్టర్ కార్తికేయ మాట్లాడుతూ.. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో నాకు ఒక క్రేజీ సీన్ ఉంటుంది. వాసు క్యారెక్టర్ కి చిన్నప్పుడే అలాంటి సీన్ ఉంటే వరుణ్ అన్నకి ఇంకెలాంటి అద్భుతమైన సీన్స్ ఉంటాయో అనే ఎక్సైట్ మెంట్ ఉంది. ఈ సినిమా కోసం చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను. సినిమా తప్పకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు

యాక్టర్ అవినాష్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి, నిర్మాతలకు థాంక్యూ సో మచ్. వరుణ్ అన్న దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. థాంక్యూ సో మచ్ అన్న. మా మూవీ నవంబర్ 14 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్ కి వెళ్లి వాచ్ చేయండి. థాంక్యూ సో మచ్’ అన్నారు.

యాక్టర్ సత్యం రాజేష్ మాట్లాడుతూ.. వైజాగ్ ప్రజలందరికీ నమస్కారం. మట్కా ఆడియన్స్ ఊహించి దానికంటే చాలా బాగుంటుంది. యాక్షన్, ఫైట్స్ పక్కా వైజాగ్ మాస్. సినిమా అంతా గోల గోలగా ఉంటుంది. కరణ కుమార్ గారికి నాకు ఎప్పటినుంచో పరిచయం. నిర్మాతలు విజయేందర్ రెడ్డి గారికి , రామ్ తాళ్ళూరి గారి కంగ్రాజులేషన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. వరుణ్ తేజ్ గారిని కలిసినప్పుడు నాకెందుకో పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టే ఉంటుంది. మట్కా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఆడియన్స్ అందరూ చూసి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్’ అన్నారు.

సత్యానంద్ మాస్టర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా అదృష్టం ఏంటంటే గ్రేట్ హీరోస్ అందరూ నా స్టూడెంట్స్. అందులో ప్రత్యేకమైన స్టూడెంట్ ఎవరంటే మా వరుణ్ బాబు. వరుణ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నా దగ్గర నటన నేర్చుకునేటప్పుడు ఒక చిన్న పిల్లాడికి నేర్పిస్తున్న ఫీలింగ్ కలిగేది. చాలా కష్టపడి చాలా ఏకాగ్రతతో నేర్చుకున్నాడు. తను ఎంత పెద్ద యాక్టర్ అవుతాడు అనేది నాకు మాత్రమే తెలుసు. ముకుంద ఫంక్షన్లో ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతానని చెప్పాను. అప్పుడు చాలామంది ఏమిటి ఇంత నమ్మకంగా చెప్తున్నారు అనుకున్నారు. తర్వాత ఆయన చేసిన కంచె, ఫిదా, గద్దల కొండ గణేష్.. ఇవన్నీ వరుసగా చూసుకుంటూ వస్తుంటే చాలా ఎదుగుదల కనిపించింది. వరుణ్ ఇంకా ఎదగాలని, ఎదుగుతారని నమ్ముతున్నాను కరుణ కుమార్ గారు మట్కా చిత్రానికి వరుణ్ బాబు నిన్ను కోవడం నా అదృష్టం. నా అదృష్టం కొద్ది ఆయనకి ఆ క్యారెక్టర్ వచ్చింది. చాలా సైకలాజికల్ గా పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ ని వరుణ్ బాబు చాలా అద్భుతంగా చేశాడని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా కరుణ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీమ్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఆల్ ది బెస్ట్ వరుణ్ బాబు. పెద్ద హిట్ కొడతారు’ అన్నారు.

డిఓపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ… హాయ్ వైజాగ్. వైజాగ్ కి రావడం ఇది రెండోసారి. సినిమా షూటింగ్ టైంలో ఫస్ట్ టైం వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. కరుణ్ కుమార్ గారికి, ప్రొడ్యూసర్స్ కి, హీరో వరుణ్ తేజ్ గారికి థాంక్యూ సో మచ్’ అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ… ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ్ కుమార్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో 15 టు 20 సెట్స్ వేయడం జరిగింది. అందులో వైజాగ్ 1962-70 మధ్య జరిగే టైం పీరియడ్ సంబంధించి పూర్ణ మార్కెట్ తో పాటు కూల్ క్లబ్ అనే మరో సెట్ ని చాలా గ్రాండ్ గా వేసాం. డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు డీటెయిల్ గా ఇన్ పుట్స్ ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. హీరో గారికి, టెక్నీషియన్స్ అందరికీ థాంక్యు వెరీ మచ్’ అన్నారు. టీం అంతా హాజరైన ఈ వేడుక గా చాలా గ్రాండ్ గా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *