KTR : జన్వాడ ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ స్పందించారు. దీపావళి పండుగకు దావత్ చేసుకుంటే తప్పా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని.. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తోందని తెలిపారు. మేము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లమన్నారు. ఇలాంటి కుట్రలకు మేము భయపడమన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఫామ్‌హౌస్ కాదు.. అది తన బావమరిది రాజ్ పాకాల ఉంటున్న ఇల్లు అని కేటీఆర్ తెలిపారు. అది ఫ్యామిలీ ఫంక్షన్. అసలు రేవ్ పార్టీ అంటే తెలుసా.. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా అక్కడ ఉన్నారన్నారు. రేవ్ పార్టీ అని చెప్పి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. “గత పదకొండు నెలలుగా ప్రభుత్వం పై పోరాడుతున్నాం. ప్రభుత్వంను ఇరుకున పెట్టే విదంగా ప్రశ్నిస్తున్నాం. మమ్ములను రాజకీయంగా ఎదుర్కోలేక.. మా కుటుంబ సభ్యుల మీద, మా మీద మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఒక ప్రహసనం గా చేస్తున్నారు. అది ఫార్మ్ హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు. ఇళ్ళల్లోకి పోయినప్పుడు అందరినీ పిలవలేదు. అందుకే ఇప్పుడు పిలిచారు. ఇది రేవ్ పార్టీ అంటున్నారు. మా అత్తమ్మ కూడా ఉన్నారు.. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. భార్యా భర్తలను పట్టుకొని… పురుషులు, మహిళలు అని విడదీసి మాట్లాడుతున్నారు. 24 గంటలు శోధించి ఏమి పట్టుకున్నారు. పొద్దున ఎక్సైజ్ సూపరిండెంట్ ఏమి దొరకలేదు అని చెప్పారు. అందరికి యూరిన్ టెస్ట్ చేశారు. ఒక్కరికే పాజిటివ్ వచ్చింది. నా బావమరిదికి నెగటివ్ వచ్చిందిఉదయం నుంచి హడావుడి చేసి సాయంత్రం NDPS కేస్ లు పెట్టారు” అని కేటీఆర్ మండిపడ్డారు.