KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్లో కేటీఆర్.. “సంపద పెంచే ఆలోచనలు మావి – ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి. మేము బంగారు బాతును చేతిలో పెడితే- మీరు పదినెలలకే చిప్ప చేతిలో పెడితిరి. నీ పిచ్చి చేష్టలకు కొత్తవి కొనాలన్న – పాతవి అమ్మాలన్న భయమే. నీ హైడ్రా దెబ్బకు హైద్రాబాద్ లో సొంతింటి కలలు కలగానే మిగిలిపాయే. నీ మూసీ ముష్ఠి పనులకు కొత్తగా కట్టేటోడు లేక కట్టినా కొనేటోడు లేక రియల్ బూమ్ కాస్త రియల్ బాంబులాయే. కాసులపై నీ కక్కుర్తి నిర్ణయాలు – రాష్ట్రాన్ని అధోగతిపాలు చెయ్యబట్టే. నాడు నిత్యం కళకళలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు – నేడు విలవిలలాడుతూ బోసిపోయే. నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే.
బంగారు తెలంగాణను బక్కచిక్కిస్తున్న నీ దౌర్బాగ్యపు పాలనకు ఇదిగో ఈ ఏప్రిల్ నుండి అక్టోబర్ లెక్కలే సాక్షాలు.” అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.