KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ట్వీట్ వార్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తన ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ ఓ శాఖపై తన అస్త్రాన్ని సందిస్తున్నారు. తాజాగా ఆరోగ్య శాఖపై ప్రభుత్వానికి పట్టింపులేదని తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ట్వీట్ చేస్తూ..” అక్రమ కేసులపై ఉన్న మోజు – ఆరోగ్య శాఖపై లేకపాయే. అడ్డగోలు సంపాదనపై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలనపై లేకపాయే. కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే. ముళ్ల కంచెలపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపాయే.
పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై లేకపాయే. గుండె పట్టేస్తుంది ఆయాసంగా ఉందనివస్తే పక్కనున్న ప్రయివేట్ ఆసుపత్రికి పొమ్మనబట్టే. పైసలే ప్రామాణికమైన మీ పైసల పాలనలో అన్ని రంగాల్లో ఆవేదనలు, అవస్థలు, అన్యాయాలే.” అంటూ కేటీఆర్ మండిపడ్డారు.