Groundnut Weeding: ఏ పంటలోనైనా కలుపు మొక్కలు ఉంటే పంట ఎదుగుదల తగ్గుతుందన్న విషయం వ్యవసాయంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వేరుశనగలో కలుపు మొక్కలు ఉంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కలుపు నివారణ పద్ధతులపై అవగాహన లేకపోవడం వల్లే రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. కలుపు నివారణ అధిక పెట్టుబడులు పెడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కలుపు మందులు మందులు వినియోగించి సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పంట లాభసాటిగా ఉంటుంది. కలుపు నివారణ పద్దతులను పాటిస్తే ఎక్కువ దిగుబడిని కూడా సాధించవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కలుపు మొక్కలను వదిలించుకోవడానికి, విత్తే ముందు లోతుగా దున్నడం ద్వారా వేప పిండిని పొలంలో కలపాలి. మట్టిని వదులుగా చేయడం ద్వారా కలుపు మొక్కలు పెరగకుండా కూడా నిరోధించవచ్చు. పంటలో కలుపు తీయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల పంట వేర్లు ఆక్సిజన్ పొందుతాయి. నేలలోని పోషకాలు కూడా పంటకు లభిస్తాయి. కలుపు మొక్కల రసాయన నివారణ కోసం కోసం ఒక కిలో పెండిమిథాలిన్‌ను 1000 లీటర్ల నీటిలో కరిగించి హెక్టారుకు పంటపై పిచికారీ చేయాలి. వేరుశెనగ విత్తిన వెంటనే మొదటి సారి (Groundnut Farming) పంట నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో పంట చాలా సున్నితంగా ఉంటుంది.
వేరుశనగ పంటకు అధికంగా హానీ కలిగించేది కలుపు మొక్కలే. కలుపు మొక్కలు వివిధ దశల్లో పంటను ఆశించి దిగుబడి తగ్గడానికి కారణమవుతాయి. వేరుశనగ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు సాళ్ల మధ్య కలుపు మొక్కలు తొందరగా పెరిగి పోషక పదార్థాలను వినియోగించుకుంటాయి. ఈ క్రమంలోనే పంటకు పోషకాలు సరిగా అందక పెరుగుదల తగ్గిపోతుంది. ఇదిలా ఉంటే.. కలుపు మొక్కలు కొన్ని రకాల పురుగులు, తెగుళ్లకు ఆశ్రయం ఇచ్చి వేరుశనగ పంటకు నష్టం కలుగుజేస్తున్నాయి. రైతు సకాలంలో కలుపు నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
వేరుశనగలో వయ్యారి భామ కలుపు మొక్కలు పూవుల పుప్పొడి అధికంగా ఉన్నప్పుడు కలుపు మొక్కల ద్వారా కాండం కుళ్లు వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. వేరుశనగ పంటలో ఎన్నెద్దులాకు, గరిటికమ్మ, ఉత్తరేణి, చినపల్లేరు వంటి కలుపు మొక్క లు కొన్ని రకాల వైరస్ తెగుళ్లను ఆశించి శిలీంధ్రాలకు ఆశ్రయమిస్తాయి. పార్ధీనియం కలుపు మొక్కలు ఉన్న ప్రాంతం నుం చి గాలి, పుప్పొడి రేణువుల ద్వారా తెగులు కారక శిలీంధ్రాలు వేరుశనగ మొక్కలకు చేరుతాయి. తెగులు సోకిన పొద్దు తిరుగుడు పొలం నుంచి పంట మార్పిడి సమయంలో కాండంకుళ్లు వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. వేరుశనగ పంటను ఆశించే కలుపు మొక్కలన్నీ గడ్డి జాతికి చెందినవవే. వెడల్పాకులు గల కలుపు మొక్కల్లో తుంగగడ్డి, ఊద, గరిక, ఊదర, చీపురుగడ్డి, కొర్రగడ్డి, ఉర్రంకి, బొంత, కుక్కవామింట, పెదపాయల కూర, గలిజేరు, పల్లేరు, గడ్డి చామంతి, ముళ్ల తోటకూర, నేల ఉసిరి, గురువుగూర, వయ్యారి బామ వంటి కలుపు మొక్కలు పంటలను నాశనం చేస్తాయి.
కలుపు నివారణ ఇలా…
వేరుశనగ విత్తిన 25 నుంచి 30 రోజుల్లో కలుపును నిర్మూలించుకోవాలి. కలుపు సమస్య తీవ్రంగా ఉన్న భూముల్లో వేరుశనగ విత్తిన 48 గంటల లోపు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటికి 1లీటరు పెండిమిథాలిన్ కలిపి నేలపై పిచికారి చేస్తే 25 రోజుల వరకు వేరుశనగ పంటలో కలుపు లేకుండా చూసుకోవచ్చు. విత్తిన 25 రోజుల తర్వాత వెడల్పు ఆకులు గల కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫిర్ 10శాతం లేదా ఇమాజీమాక్స్ 35 శాతం కలుపు మందును 40 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చు.