BJP Kishan Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుండి నీళ్లు తీసుకువచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోమన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్ కట్టాలన్నారు. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సీవరేజ్ ప్లాంట్‌కు నిర్మాణాలు చేపట్టాలన్నారు. కులగణనకు వ్యతిరేకం కాదన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలన్నారు. తన డీఎన్ఏ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్న కిషన్ రెడ్డి.. ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పార్టీ గెలువాలి ఆ దృష్టిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతంలో బస చేస్తాం.. ఒకరోజు అక్కడే నిద్రిస్తామన్నారు. అక్కడుండే వాళ్ల ఇళ్లలో ఉంటాం, తింటామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఖతం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై స్వయంగా మోడీ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవన్నారు. ఫ్లైఓవర్లు, ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలపై సీఎంకి లేఖ రాస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభినస్తామని చెప్పారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభోత్సవానికి వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.