Ganja: కేరళలోని ఇడుక్కిలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాల విద్యార్థుల బృందం గంజాయి బీడీ అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి.. హల్లో ఎక్సుక్యూజ్ మీ.. అగ్గిపెట్టుందా! అంటూ అగ్గిపెట్టెను అడిగారు. దీంతో అధికారులు నిర్ఘాంతపోయారు. కేరళ ఇడుక్కిలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్ అయ్యారు.
మున్నార్ ట్రీప్ వెళ్ళిన విద్యార్థులు గంజాయి బీడి వెలిగించుకోవడానికి ఎక్సైజ్ ఆఫీస్ కు వెళ్ళి అగ్గిపెట్టె అడిగినా వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. త్రిసూర్‌లోని ఎయిడెడ్ పాఠశాలకు చెందిన మున్నర్ ట్రిప్ కు వందమంది విద్యార్థులు వెళ్లారు. మార్గమధ్యంలో తినడానికి వాహనాలు ఆపిన సమయంలో గంజాయి బీడి తాగాలని విద్యార్థులు బావించారు. అగ్గిపెట్టె కోసం సమీపంలోని సీజ్ చేసిన వాహనాలు చూసి వర్క్ షాప్ అనుకుని ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్ళి అగ్గిపెట్టె అడిగారు. ఎక్సైజ్ పోలిసులు అనుమానంతో విద్యార్థులు అదుపులో తీసుకుని విచారించి సుమారు ఆరు గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఇద్దరు మైనర్ల పై కేసు పెట్టారు. చాలామంది పిల్లలు తొలిసారిగా గంజాయి సేవించినటు విచారణలో వెల్లడైంది.