Home » Jani Master: నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా.. జానీ మాస్టర్ సతీమణి కీలక వ్యాఖ్యలు

Jani Master: నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా.. జానీ మాస్టర్ సతీమణి కీలక వ్యాఖ్యలు

Jani Master: తన భర్త జానీ మాస్టర్ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాలు లేకుండా ఆయన ఎందుకు చేస్తారని జానీ మాస్టర్్ భార్య ఆయేషా తెలిపారు. తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డారని, అవకాశాలు రాకుండా చూస్తానని బెదిరించాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మహిళా కొరియోగ్రాఫర్ నిజం నిరూపిస్తే తన భర్తను వదిలేస్తానని జానీ మాస్టర్ భార్య ఆయేషా పేర్కొన్నారు. ఓ ఛానల్తో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.


కొరియోగ్రాఫర్ గా అగ్రస్థానంలో ఉండాలి లేదా హీరోయిన్ గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక అని ఆయేషా వెల్లడించారు. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె సినీ రంగాన్ని చూసి ఆ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేదన్నారు. తనకెక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుందన్నారు. మైనర్ గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటని ప్రశ్నించారు. జానీ మాస్టర్ తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా అని, ఇప్పటి వరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడడానికి ఏమైందన్నారు. ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టమని నవ్వుతూ ఎందుకు చెబుతుందని ఓ ఛానల్ తో మాట్లాడూతూ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *