Home » Iran: ఇరాన్‌లో ఒక వ్యక్తిని రెండుసార్లు ఎందుకు ఉరితీశారు?.. మొత్తం కథ తెలుసుకోండి..

Iran: ఇరాన్‌లో ఒక వ్యక్తిని రెండుసార్లు ఎందుకు ఉరితీశారు?.. మొత్తం కథ తెలుసుకోండి..

Iran Man Hanged For Second Time After 6 Months: ప్రపంచంలో మరణశిక్షలు ఎక్కువగా అమలు చేస్తున్న దేశాల్లో రాడికల్ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ కూడా ఉంది. కానీ ఈసారి ఇరాన్‌లో మరణశిక్షకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. దీనిలో కొన్ని నెలల వ్యవధిలో ఒక వ్యక్తిని రెండవసారి ఉరితీశారు. నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఐహెచ్‌ఆర్) ఈ విషయాన్ని వెల్లడించింది. NGO ప్రకారం, అహ్మద్ అలీజాదే అనే 26 ఏళ్ల యువకు డు అక్టోబర్ 2018 నుంచి ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు నేరాన్ని అంగీకరించకపోయినప్పటికీ కోర్టు అతడికిమరణశిక్ష విధించింది.


ఏప్రిల్ 27న అహ్మద్ ను ఉరితీస్తుండగా బాధిత కుటుంబీకులు ‘తనను క్షమించండి’ అంటూ గట్టిగా అరవడంతో ఆ ఉరిని నిలిపివేశారు. అహ్మద్ సాఫీగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇరాన్ యొక్క షరియా చట్టం ప్రకారం, బాధితురాలి కుటుంబం నేరస్థుడిని క్షమించవచ్చు లేదా అతని ప్రాణాలను కాపాడినందుకు బదులుగా డబ్బును డిమాండ్ చేయవచ్చు. అయితే, హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, చాలా కేసుల్లో దోషి కుటుంబం ఈ మొత్తాన్ని భరించలేక ఉరిశిక్ష కొనసాగుతోంది. నష్టపరిహారం విషయంలో నిందితుడి కుటుంబంతో రాజీ కుదరకపోవడంతో బుధవారం అతడి ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయాన్ని ఇరాన్‌లో మరణశిక్షలను నివేదిస్తున్న నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌(ఐహెచ్‌ఆర్‌ ) పేర్కొంది.

నవంబర్ 13 బుధవారం ఉదయం, అహ్మద్ అలీజాదేను మళ్లీ ఉరితీశారు. ఐహెచ్ ఆర్ డైరెక్టర్ మహమూద్ అమిరి-మొగద్దమ్ ఇరాన్ పాలనను విమర్శించారు. అహ్మద్ అలీజాదే అనే తెలివైన విద్యార్థి హత్యా నేరం కింద రెండవసారి ఉరితీయబడ్డాడని ఈ విషయాన్ని దానిని ఖండించాడు . IHR ప్రకారం, ఇరాన్‌లో పాలనపై వ్యతిరేకతను అణిచివేసేందుకు మరణశిక్షను బెదిరింపుల రూపంలో ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. 2024లో మరణశిక్షల సంఖ్యలో కొత్త పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క అక్టోబర్‌లోనే కనీసం 166 మరణశిక్ష కేసులు నమోదయ్యాయి. సంస్థ 2007లో ఉరిశిక్షలను నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి ఒకే నెలలో నమోదైన అత్యధిక సంఖ్య ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *