Teja Sajja: ఇటీవలే దుబాయిలో నిర్వహించిన ‘ఐఫా’ అవార్డుల (IIFA Awards-2024) హోస్టింగ్‌లో రానా దగ్గుబాటి, తేజా సజ్జ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై తేజ క్లారిటీ ఇచ్చారు. అదొక జాతీయస్థాయి వేడుక అని చెప్పారు. అవకాశం వస్తే మరోసారి తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తానని అన్నారు. ‘‘ఐఫా’ అవార్డులకు సినీ పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇదొక జాతీయస్థాయి వేడుక. ఎంతోమంది స్క్రిప్ట్ రైటర్స్ దీనికోసం వర్క్ చేస్తుంటారు. అన్నివిధాలా చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు ఇచ్చారు. అదీకాక ఇప్పుడు సోషల్ మీడియా వేదాయికగా చేసినవన్నీ కూడా కట్ చేసిన క్లిప్స్ మాత్రమే అని. బహుశా మీరు ఫుల్ వీడియో చూసి ఉంటే ఎవరికీ ఇటువంటి ఉద్దేశం వచ్చి ఉండేది అని అలానే హీరో రానా నాపై జోకులు వేశారని అందరికీ అర్థమైంది. అందరూ వాటిని జోక్‌గానే చూశారు. చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా. అందరి హీరోలతో పనిచేస్తూ పెరిగా. వారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. ఆ ఆలోచన కూడా రాదు.
మా వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇది జరిగింది’’ అని తేజ క్లారిటీ ఇచ్చారు.ఈ విషయంపై రానా దగ్గుబాటి కూడా స్పందించారు. తాజాగా తాను హోస్ట్ చేస్తున్న ‘ది రానా దగ్గుబాటి షో’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈవిషయంపై మాట్లాడారు. చాలా మంది ఐఫా వేడుకల్లో నేను మాట్లాడిన మాటలు విమర్శలుగా అనుకుంటున్నారని దీనిపైనా హీరో నాని నాకొక సలహా ఇచ్చారు. నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వు జోక్స్ వేసినప్పుడు.. అది జోక్ అని తెలిసినట్లు వెయ్. లేకపోతే తెలియడం లేదు. ఇది జోక్.. అందరూ నవ్వండి అని నెక్స్ట్ టైమ్ నుంచి ఒక సబ్ టైటిల్ వేద్దామనుకుంటున్నా’’ అని అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా సెప్టెంబర్‌లో ఘనంగా జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ వేడుకలో సందడి చేశారు. తెలుగు సినీ రంగానికి సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవానికి రానా, తేజ హోస్ట్‌గా వ్యవహరించారు. అగ్ర తారలు, గతంలో విడుదలైన పలు భారీ చిత్రాలను ఉద్దేశించి సరదాగా కామెంట్స్ చేశారు. అవి నెట్టింట వైరల్‌గా మారాయి.