Husband Killed Wife in Hyderabad
Crime News: అనుమానం అనే పెనుభూతం అతడిని కమ్మేసింది. కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం ఆందోల్‌కి తీసుకువచ్చాడు. గుండెపోటుతో భార్య ఇందిరా చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు భర్త నర్సింహులు. కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి నిలదీయడంతో హత్య చేసినట్టు నర్సింహులు ఒప్పుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జోగిపేట పోలీసులు నర్సింహులుని అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో గ్యాస్ డెలివరి బాయ్‌గా నర్సింహులు పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చిట్కుల్ గ్రామనికి చెందిన ఇందిరతో నర్సింహులుకి వివాహం జరిగింది. భార్య హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా తీశారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్టు నిందితుడు భర్త నర్సింహులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. లంగర్ హౌజ్ ఎస్సై రఘుతో భార్య ఇందిరాకి వివాహేతర సంబంధం ఉందని భర్త ఆరోపించాడు. తాను లేనప్పుడు ఎస్సై తరుచూ ఇంటికోవచ్చేవాడని నర్సింహులు చెబుతున్నాడు.గంటల తరబడి ఎస్సైతో ఫోన్ లో మాట్లాడేదని జోగిపేట పోలీసుల ముందు నర్సింహులు స్టేట్ మెంట్ ఇచ్చాడు. మృతురాలు మొదటి భార్య ఇందిరాకి పిల్లలు పుట్టకపోవడంతో నర్సింహులు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో కలిసి హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.