Hero Suriya: స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నేడు వైజాగ్ లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – “హీరో సూర్య గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది. ఆయన పక్కనే కూర్చునే అవకాశం దక్కింది. సూర్య గారి అభిమానిగా ఉండటం కష్టం. ఎందుకంటే ఆయనలా ఫిట్ నెస్ మెయింటేన్ చేయాలి. ఆయనలా డెడికేటెడ్ గా ఉండాలి. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. తెలుగు ఆడియెన్స్ కు ప్రాపర్ తమిళ చిత్రాన్ని పరిచయం చేసింది సూర్య గారే. డైరెక్టర్ శివ గారి గురించి తమిళంలోనే కాదు తెలుగులో చాలా పాజిటివ్ గా చెబుతారు. జ్ఞానవేల్ రాజా గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయనకు కంగువ మరింత మంచి పేరు తీసుకురావాలి.” అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ – “వైజాగ్ కంగువ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఘంటా శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు చెబుతున్నాం. వైజాగ్ తో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా నాన్నగారి సినిమాల షూటింగ్ విశాఖలో జరిగినప్పుడు మేము వచ్చేవాళ్లం. అప్పటినుంచి వైజాగ్ తో అనుబంధం కొనసాగుతోంది. నేను కంగువ లాంటి బిగ్ మూవీ చేసేందుకు నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది. మా యూనిట్ లోని మూడు వేల మంది జీవిత భాగస్వాములు కూడా తమ కుటుంబాలను ఏ లోటు లేకుండా చూసుకోవడం వల్లే మేము రెండేళ్ల పాటు కంగువ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేయగలిగాం. అందుకు ఆ గొప్ప మహిళలు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. నాకు తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి మంచి మిత్రులు దొరకడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా డబ్బు కోసం చేసింది కాదు మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం. థియేటర్ లో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా కంగువ ఉంటుంది. నవంబర్ 14న థియేటర్స్ లో కంగువ చూసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.” అన్నారు.
డైరెక్టర్ శివ మాట్లాడుతూ – “నేను జ్ఞానవేల్ రాజా గారికి మూడు కథలు చెప్పాను. ఆయనకు నచ్చాయి. మరో కథ ఉంది సార్ కానీ ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నాను. పర్లేదు చెప్పండి అన్నారు. అలా చెప్పిన కథే కంగువ. ఈ కథను సూర్య గారికి చెప్పండి అని జ్ఞానవేల్ గారు అన్నారు. సూర్య గారికి చెప్పగానే హగ్ చేసుకుని ఈ సినిమా మనం చేద్దాం శివ అన్నారు. అలా కంగువ మొదలైంది. ప్రతి దర్శకుడికి ఒక ఎపిక్ మూవీ చేయాలని ఉంటుంది. నాకూ అలాంటి అవకాశం కంగువతో దొరికింది. నాకు దేవిశ్రీ ప్రసాద్ లాంటి మంచి టీమ్ మెంబర్స్ దొరికారు. కంగువ ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా నవంబర్ 14న థియేటర్స్ కు వెళ్లమని రిక్వెస్ట్ చేస్తున్నా.” అని అన్నారు.